మూడు రాజధానులపై స్పందించిన పవన్

మూడు రాజధానులపై స్పందించిన పవన్
x
Pawan Kalyan File Photo
Highlights

ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం విమర్శిస్తుంటే

ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి జగన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షం విమర్శిస్తుంటే.. కాంగ్రెస్, లోక్‌సత్తా, పార్టీలు ఆహ్వానిస్తున్నాయి. కాగా ఈ నేపధ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీనిపై స్పందించారు. తినడానికి మెతుకులు లేకతండ్రి ఏడుస్తుంటే.. కొడుకు వచ్చి పరమాన్నం కావాలన్నాడంట అంటూ ట్విట్ చేశారు.

కాగా.. అమరావతి ఇప్పటిదాకా దిక్కూ లేదని విమర్శిచారు. జగన్ రెడ్డి గారి మూడు మూడు అమరావతులు అయ్యేనా అంటూ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అనిశ్చితి, అశాంతి, అభద్రత మినహా ఒరిగిందేమీ లేదని, పాలకుల వల్ల ఏపీ రాష్ట్ర విభజన తప్ప ఏమి ఒరగలేదని పవన్ కళ్యాణ్ ట్విట్ చేశారు.

అయితే అసెంబ్లీలో సీఎం జగన్ అభివృద్ధి వికేంద్రీకరణ విధానం మంచిదన్న జగన్‌ మనం కూడా మారాల్సిన అవసరముందన్నారు. సౌతాఫ్రికాకు మూడు రాజధానులు ఉన్నాయని గుర్తుచేసిన జగన్మోహన్‌రెడ్డి ఏపీలో మూడు కేపిటల్స్‌ పెట్టుకోవచ్చంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిలో లేజిస్టేటివ్‌ కేపిటల్‌ విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్ అలాగే కర్నూలులో హైకోర్టు జ్యుడీషియల్ కేపిటల్ పెట్టుకోవచ్చన్నారు. ఏమో ఏపీకి మూడు కేపిటల్స్ వస్తాయేమోనన్న సీఎం జగన్‌ ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఉండాల్సిన అవసరం కనిపిస్తోందన్నారు

అయితే కాంగ్రెస్, బీజేపీ, లోక్‌సత్తా పార్టీలు సీఎం జగన్ నిర్ణయాన్ని స్వాగతించాయి. కొన్ని మార్పులు చేయాలని కాంగ్రెస్ సూచించింది. శాసన రాజధానిగా విశాఖ చేయాలని, ఎగ్జిక్యూటివ్ రాజధాని అమరావతి చేయాలని కాంగ్రెస్ సూచించింది. కాగా. లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. జగన్ వ్యాఖ్యలను స్వాగతించాల్పిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రికృతం అయితే భవిష్యత్తులో వివాదాలు రావోచ్చని, అంతా ఒకే ప్రాంతంలో ఉంటే ఎలా అని ప్రశ్నించారు. జగన్ నిర్ణయం సరైందని అన్నారు. అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించాలని జేపీ అన్నారు. అయితే రాష్ట్రానికి కేంద్ర బిందువుగా అమరావతిని ఉంచాలని సూచించారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories