ఇవాళ భారత్‌లో అడుగుపెట్టనున్న తెలుగు మత్స్యకారులు

ఇవాళ భారత్‌లో అడుగుపెట్టనున్న తెలుగు మత్స్యకారులు
x
Representational Image
Highlights

పదమూడు నెలల పాటు పాక్ చెరలో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు విముక్తి కలిగింది.

పదమూడు నెలల పాటు పాక్ చెరలో బందీలుగా ఉన్న సిక్కోలు మత్స్యకారులకు విముక్తి కలిగింది. గుజరాత్‌లోని వీరావలి ప్రాంతానికి వేట కోసం వెళ్లిన మత్స్యకారులు పాక్ కోస్టు గార్డులకు చిక్కారు. అప్పటి నుంచీ శ్రీకాకుళం జిల్లా డి.మత్స్యలేశం గ్రామానికి చెందిన బాధిత కుటుంబాలు తీవ్ర మనోవేధనకు గురయ్యాయి. తమ వారిని విడిపించాలంటూ 13 నెలలుగా అధికారుల చుట్టూ తిరిగిన ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. వాఘా సరిహద్దు వద్ద సిక్కోలు మత్స్యకారులను భారత విదేశాంగ శాఖ అధికారులకు పాక్ అప్పగించనుంది.

పాకిస్ధాన్ కోస్టు గార్డులకు చిక్కిన వారిలో డి.మత్స్యలేశం, కొత్త మత్స్యలేశం, శివాజీదిబ్బల పాలెం, బడివానిపేట గ్రామాలకు చెందిన సుమారు 15 మంది మత్స్యకారులు ఉన్నారు. వీరంతా బతుకుదెరువు కోసం గుజరాత్‌లోని వీరావళికి వెళ్లారు. వేట సమయంలో దట్టమైన పొగమంచు కారణంగా వీరు ఉన్న బోటు పాక్ అంతర్భాగంలోకి వెళ్లటంతో అప్పటి నుంచి పాకిస్ధాన్ జైలులో మగ్గుతున్నారు. వీరంతా ఇవాళ భారత భూభాగంలోకి అడుగుపెట్టనున్నారు.

శ్రీకాకుళం జిల్లాలోని బాధిత కుటుంబాల్లో ఆనందం వ్యక్తమౌతోంది. పాక్ చెర నుంచి తమ వారు విడుదలైన దృష్యాలు చూసిన శ్రీకాకుళం జిల్లాలో మత్స్యకార కుటంబాలు ఆనందడోలికలలో మునిగితేలారు. టపాకాయిలు పేల్చి , స్వీట్లు తినిపించుకుని మురిసిపోయారు. 14 నెలల తరువాత తమ కుటంబ సభ్యులను కలుసుకోనుండటంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. వాఘ సరిహద్దు వద్ద మత్స్యకారులను మంత్రి మోపిదేవి కలవనున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories