న్యూయర్ గిఫ్ట్...ఉల్లి కిలో రూ.15కే

న్యూయర్ గిఫ్ట్...ఉల్లి కిలో రూ.15కే
x
Highlights

కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మంచి కానుకను అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు...

కొత్త సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలకు మంచి కానుకను అందించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా ఉల్లి పంట దిగుబడి తగ్గిపోవడంతో ఉల్లి ధరలు పెరిగిపోయాయి. ఈ నేప‌థ్యంలనే ఆకాశానికి ఎగిసిన ఉల్లిపాయల ధరలను దృష్టిలో పెట్టుకుని చవకధరలకు ఉల్లిపాయలను అందించేందుకు ప్రయత్నాలు చేస్తుంది ఆంధ్ర ప్రభుత్వం. ఈ ప్రయత్నంలో భాగంగానే ఈ రోజు నుంచి బజార్ల ద్వారా కిలో ఉల్లిని రూ.15కే విక్రయించనుంది.

ఇందుకోసం కడప జిల్లా రైతుల నుంచి పెద్ద ఎత్తున ఉల్లిపాయలను కొనుగోలు చేసింది ప్రభుత్వం. రైతుల నుంచి కిలో ఉల్లిని రూ.50 చెల్లించి కొనుగోలు చేసిన ప్రభుత్వం సామాన్యులకు రూ.15కే విక్రయించనుంది. రాష్ట్రవ్యాప్తంగా చూసుకుంటే 130 రైతు బజార్లు ఉన్నాయి. వాటితో కేవలం 101 రైతుబజార్లలో మాత్రమే సామాన్యులకు తక్కువ ధరలకు ఉల్లిని విక్రయించనుంది. ఈ సందర్భంగానే ప్రతి రోజూ 50 టన్నుల ఉల్లిని తెప్పించనున్నట్టు మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు. ఇక కడప నుంచి కాకుండా పొరుగు దేశాలు ఈజిప్ట్, టర్కీ నుంచి ఉల్లి దిగుమతి చేస్తే వాటిని కిలోకు రూ.25 చొప్పున సరఫరా చేయాలని నిర్ణయించింది.

ఏదైతే నేం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సామాన్యుల కోసం కొత్త సంవత్సరంలో మంచి ఆలోచన చేసి ఉల్లి కష్టాలను దూరం చేస్తుంది. కేవలం ఆంధ్రప్రదేశ్ లో మాత్రమే కాకుండా ఉల్లి ధరలు ఆకాశానికి చేరుకోవడంతో సామాన్యులకు ఉల్లి కష్టాలు తప్పడం లేదు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories