రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు : సుచరిత

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదు : సుచరిత
x
Highlights

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదని ఏపీ హోంమంత్రి సుచరిత తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. వ్యవసాయానికి 9...

రాష్ట్రంలో విద్యుత్‌ కొరత లేదని ఏపీ హోంమంత్రి సుచరిత తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల వరకు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నామని.. వ్యవసాయానికి 9 గంటల పాటు విద్యుత్‌ను ఉచితంగా అందిస్తున్నట్లు హోంమంత్రి సుచరిత తెలిపారు. ఉచిత విద్యుత్‌ వల్ల 2 లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు లబ్ది పొందుతున్నారని వివరించారు. విద్యుత్‌ కొరత ఉందంటూ వాదిస్తున్న ప్రతిపక్షం ఆరోపణల్లో వాస్తవం లేదని చెప్పారు. వర్షాకాలంలో చెట్లు పడిపోవడం, తీగలు తెగిపోవడం వంటి కారణాలతో స్వల్ప అంతరాయం ఏర్పడుతోందని.. వీటిని విద్యుత్ కోతలుగా భావించరాదని చెప్పారు. విద్యుత్ అంతరాయ శాతాన్ని గత ప్రభుత్వంతో పోల్చి చూస్తే గణనీయం తగ్గించగలిగామని సుచరిత అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories