డెంటల్ విద్యార్థిని తపస్వి హత్య కేసులో కీలక విషయాలు

* జ్ఞానేశ్వర్‌ పై పోలీసులకు తపస్వి ఫిర్యాదు చేసినట్టు సమాచారం

R Tripura Malini
Updated on: 7 Dec 2022 10:42 AM IST
New Twists In Tapaswi Murder Case Of Dental Student
X

డెంటల్ విద్యార్థిని తపస్వి హత్య కేసులో కీలక విషయాలు

Dental Student Murder Case: గన్నవరం, పామర్రు పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో కేసుపై ఆరా తన బంగారం అమ్మి జ్ఞానేశ్వర్‌కు బైకు, వాచ్ కొనిచ్చిన తపస్వి చెడు వ్యసనాలు ఉన్న జ్ఞానేశ్వర్‌ను దూరం పెట్టిన యువతి తాను గిఫ్ట్ ఇచ్చిన వాచ్, బైకు తిరిగి ఇవ్వాలని అడిగిన తపస్వి వాచ్ వాపస్ ఇచ్చిన జ్ఞానేశ్వర్ వాచ్ లొకేషన్‌తో ట్రాక్ చేసిన నిందితుడు తపస్వి ఇచ్చిన బైక్ మీదే వెళ్లి ఆమెను హత్య చేసినట్టు గుర్తించిన పోలీసులు హత్యకు వాడిన సర్జికల్ బ్లేడ్ విజయవాడలో కొనుగోలు చేసినట్లు గుర్తింపు

డెంటల్ విద్యార్థిని తపస్వి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. గతంలోనే జ్ఞానేశ్వర్‌పై పోలీసులకు తపస్వి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. అయినా ఫిర్యాదు చేసినప్పడు పోలీసులు చర్యలు తీసుకోలేదు. దీంతో కృష్ణా జిల్లా పోలీసు అధికారులు అంతర్గత విచారణ చేపట్టారు. ఎస్‌పీ ఝాషువా ఆదేశాలతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. గన్నవరం, పామర్రు పరిధిలోని పోలీస్‌స్టేషన్లలో ఈ కేసుపై ఆరా తీస్తున్నారు.

ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై ఒకరికొకరు ఇష్టపడ్డారు. తపస్వి తన బంగారం అమ్మి జ్ఞానేశ్వర్‌కు బైకు, వాచ్ కొనిచ్చింది. చెడు వ్యసనాలు ఉన్న జ్ఞానేశ్వర్‌ను తపస్వి దూరం పెట్టింది. పెళ్లికి కూడా నిరాకరించింది. ఈ క్రమంలో తాను గిఫ్ట్ ఇచ్చిన వాచ్, బైకు తిరిగి ఇవ్వాలని తపస్వి అడిగడంతో జ్ఞానేశ్వర్ వాచ్ వాపస్ ఇచ్చాడు. కానీ బైకు తన వద్దే ఉంచుకున్నారు. తపస్వి వద్ద ఉన్న వాచ్ లొకేషన్‌తో ఆమె ఎక్కడుందని ట్రాక్ చేశాడు జ్ఞానేశ్వర్ తపస్వి ఇచ్చిన బైకు మీదే వెళ్లి ఆమెను హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. హత్యకు వాడిన సర్జికల్ బ్లేడ్ విజయవాడలో కొనుగోలు చేసినట్లు గుర్తించారు పోలీసులు.

R Tripura Malini

R Tripura Malini

Next Story