Narendra Modi: కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది

Narendra Modi: అవినీతి విషయంలో ఏపీ మంత్రులు పోటీ పడుతున్నారు

Shashank Gullapelli
Published on: 17 March 2024 9:07 PM IST
Narendra Modi Said That There Is A Secret Agreement Between Congress And YCP
X

Narendra Modi: కాంగ్రెస్, వైసీపీ మధ్య రహస్య ఒప్పందం ఉంది

Narendra Modi: ఏపీలో వైసీపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఉందని, వైసీపీని గెలిపించేందుకు కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని ప్రధాని మోడీ విమర్శించారు. ఏపీలో కాంగ్రెస్, వైసీపీ ఓక్కటేనని... రెండూ కుటుంబ పార్టీలేనని విమర్శించారు. ఏపీలోని బొప్పూడిలో ప్రజాగళం సభలో ఆ‍యన వైసీపీ, కాంగ్రెస్ పార్టీలపై నిప్పులు చెరిగారు. దేశంలో ఇండియా కూటమిలో ఉన్న పార్టీలది ఒక్కొక్కరిది ఒక్కో దారి అని, ఆ కూటమిలో ఇప్పుడే ఇలా కొట్టుకుంటుంటే ఎన్నికల తర్వాత ఆ కూటమి పరిస్థితతి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చాన్నారాయన...

ఏపీ మంత్రులు అవినీతి విషయంలో పోటీ పడుతున్నారని, ఈ అవినీతిలో కూరుకుపోయిన వైసీపీ ప్రభుత్వాన్ని పెకిలించేందుకు ఏపీ ప్రజలు నిర్ణయం తీసుకున్నారని అన్నారు మోడీ... తాము ఎన్డీయేలో ఉన్న సహచర పార్టీలను కలుపుకొని వెళ్తాన్నామని చెప్పుకొచ్చారు. ఏపీ ప్రజల కోసం చంద్రబాబు, పవన్ కల్యాణ్ అహర్నిశలూ కృషి చేస్తున్నారని ప్రధాని కొనియాడారు.. ఢిల్లీలో, ఏపీలో ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తేవాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.Narendra Modi Said That There Is A Secret Agreement Between Congress And YCP

Shashank Gullapelli

Shashank Gullapelli

Next Story