ప్రజావేదిక కూల్చివేతపై నారా లోకేశ్ స్పందన

ప్రజావేదిక కూల్చివేతపై నారా లోకేశ్ స్పందన
x
Highlights

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తయ్యింది. పైకప్పు మినహా ప్రజావేదిక గోడలన్నీ కూల్చేశారు. ఇనుప షీట్లు, గడ్డర్లు ఉండటంతో పైకప్పును కూల్చేందుకు వెల్డింగ్...

ప్రజావేదిక కూల్చివేత దాదాపు పూర్తయ్యింది. పైకప్పు మినహా ప్రజావేదిక గోడలన్నీ కూల్చేశారు. ఇనుప షీట్లు, గడ్డర్లు ఉండటంతో పైకప్పును కూల్చేందుకు వెల్డింగ్ యంత్రాలను రప్పిస్తున్నారు. ఈరోజు సాయంత్రానికి పైకప్పును కూడా పూర్తిగా తీసేస్తామని సీఆర్డీఏ అధికారులు చెబుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో మాజీ సీఎం నారా చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ ప్రజావేదిక కూల్చివేతపై స్పందించారు. కృష్ణా నదికి వంద మీటర్ల దూరంలో ప్రజావేదిక ఉందని అన్నారు లోకేశ్. అసలు ప్రజావేదికను అర్ధరాత్రి సమయంలో కూల్చడమేంటి? అని ప్రశ్నించారు. కరకట్టపై ఉన్న నిర్మాణాల్లో ఏవి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో, ఏవి లేవో గ్రీన్ ట్రైబ్యునల్ తీర్పు చూస్తే తెలుస్తుందని అన్నారు. ఈ తీర్పు ప్రకారం కృష్ణానదికి వంద మీటర్ల దూరంలో ప్రజావేదిక భవనం ఉందని గుర్తుచేశారు. కరకట్టపై ఉన్న వన్నీ అక్రమ నిర్మాణాలు కాదని లోకేశ్ చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories