పీపీఏలపై నిజాలను వక్రీకరించారు: చంద్రబాబు

పీపీఏలపై నిజాలను వక్రీకరించారు: చంద్రబాబు
x
Highlights

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చకొనసాగింది. పీపీఎలపై నిజాలను వక్రీకరించారని మండిపడ్డారు ప్రతపక్ష నేత చంద్రబాబు....

విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ఏపీ అసెంబ్లీలో వాడివేడిగా చర్చకొనసాగింది. పీపీఎలపై నిజాలను వక్రీకరించారని మండిపడ్డారు ప్రతపక్ష నేత చంద్రబాబు. విద్యుత్ సంస్కరణలు, రెగ్యులలేటరీ తీసుకు వచ్చిందే తామేనని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కరెంట్ చార్జీలు పెంచకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 22.5 మిలియన్‌ యూనిట్ల కొరత ఉంటే.. ఆ కొరత లేకుండా చేశామని, ఇప్పుడు రాష్ట్రంలో మళ్లీ కరెంటు కోతలు మొదలయ్యాయని చంద్రబాబు ఆరోపించారు. కర్ణాటక ప్రభుత్వానికి జగన్ కు చెందిన విండ్ పవర్ కంపెనీ అధిక ధరలకు విద్యుత్తును విక్రయిస్తున్న విషయాన్ని చంద్రబాబు సభలో గుర్తు చేశారు. దీనికి వైసీపీ సభ్యులు అభ్యంతరం తెలిపారు. చంద్రబాబు వ్యాఖ్యలపై సీఎం జగన్ కౌంటర్ ఇచ్చారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో భారీ అవకతవకలు జరగాయని జగన్ అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల మీద కమిటీ వేశామని విచారణ కొనసాగుతోందని చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories