అందర్నీ ఆకర్షించిన ఎంపీ గోరంట్ల మాధవ్ స్నేహగీతం!

అందర్నీ ఆకర్షించిన ఎంపీ గోరంట్ల మాధవ్ స్నేహగీతం!
x
Highlights

స్నేహబంధం.. దానికి అధికారాలు.. స్థాయీ బేధాలూ తెలియవు. ఒరేయ్ అని పిలుచుకునే బంధానికి ఏ అంతస్తూ అడ్డు రాదు. దీనిని చాటి చెప్పే సంఘటన ఈరోజు అనంతపురంలో...

స్నేహబంధం.. దానికి అధికారాలు.. స్థాయీ బేధాలూ తెలియవు. ఒరేయ్ అని పిలుచుకునే బంధానికి ఏ అంతస్తూ అడ్డు రాదు. దీనిని చాటి చెప్పే సంఘటన ఈరోజు అనంతపురంలో చోటుచేసుకుంది. పోలీసు శాఖలో సీఐ గా పనిచేసి.. పెద్ద పెద్ద నాయకుల్ని కూడా గడగడ లాడించిన గోరంట్ల మాధవ్ తరువాత రాజకీయాల్లోకి వచ్చి ఎంపీ అయిన విషయం తెలిసిందే. ఆయన ఈరోజు అనంతపురం రూరల్ లో కొమిడి గ్రామం దగ్గరలో వనమహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు.

వనమహోత్సవ కార్యక్రమం మొదలు కాబోతోంది. అక్కడంతా హడావుడిగా ఉంది. ఇంతలో, గట్టిగా ఓ పిలుపు.. ఒరేయ్! మురళీధర్.. అక్కడేం చేస్తున్నావ్ ఇటురా! అని వినిపించింది. దానికి అక్కడ బందోబస్తు విధులు నిర్వర్తిస్తున్న మురళీధర్ రెడ్డి ఉలిక్కి పడ్డారు. ఆ పిలిచిన వారు గోరంట్ల మాధవ్.. దాంతో అక్కడ ఉన్నవారందరూ ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపే మరో షాక్ తగిలింది. సీఐ మురళీధర్ రెడ్డి మాధవ్ వద్దకు వెళ్ళారు. వెంటనే మాధవ్ ఆయనను హత్తుకున్నారు. నువ్వు నాకు బందోబస్తు చేయడమేమిట్రా అంటూ పక్కన కూర్చోపెట్టుకున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. మాధవ్ సిఐగా ఉన్నప్పుడు మురళీధర్ స్నేహితులు. అది గుర్తుంచుకున్న అయన బందోబస్తుకు వచ్చిన తన మిత్రుడిని పక్కన కూచోపెట్టుకుని మాట్లాడటం అందరిలో మాధవ్ కు మరింత విలువను పెంచింది. ఈ సందర్భంగా మాధవ్ మాట్లాడుతూ, విధి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ ఒత్తిళ్లకు తలొగ్గకుండా విధులు నిర్వహించే మురళీ లాంటి అధికారి మన జిల్లాకు లభించడం అదృష్టమని ఎంపీ గోరంట్ల మాధవ్ పేర్కొన్నారు. మురళి మంచి ఇంటలిజెంట్ అని, కాస్తలో ఉన్నతోద్యోగాలు తప్పిపోయినట్లు ఆయన వివరించారు. 1998లో పోస్టింగ్ లభించినప్పుడు నుండి ఇప్పటివరకు తమ స్నేహబంధం కొనసాగుతున్నదని ఎంపీ మాధవ్ పేర్కొన్నారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories