జ్యూట్‌ చేతి సంచులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి

ఆళ్ల రామకృష్ణా రెడ్డి
x
ఆళ్ల రామకృష్ణా రెడ్డి
Highlights

రోజు, రోజుకు సమాజంలో ఏ పట్టణంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోతుంది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం...

రోజు, రోజుకు సమాజంలో ఏ పట్టణంలో చూసినా, ఏ గ్రామంలో చూసినా పర్యావరణంలో కాలుష్యం పెరిగిపోతుంది. పెరిగిపోతున్న కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రభుత్వం చాలా ప్రయత్నాలను చేస్తుంది. ఈ కోణంలోనే ఇప్పుడు ప్లాస్టిక్ ని విడిచి పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఓ ప్రయత్నం చేశారు. మంగళగిరి మిద్దె సెంటర్ కి శనివారం వెళ్లారు. మార్కెట్ కు వచ్చిన వారికి, అక్కడ ఉన్న దుకాణ దారులకు ఉచితంగా జ్యూట్‌ చేతి సంచులను పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమం తరువాత ఆయన మాట్లాడుతూ మంగళగిరిని ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా తీర్చదిద్దాలని ప్రజలకు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. ప్లాస్టి్క్ సంబంధిత వస్తువులను పూర్తిగా మానేయాలని తెలిపారు. ఏ మైనా వస్తువులను కొన్నప్పుడు జ్యూట్‌ సంచులను మాత్రమే ఉపయోగించాలని కోరారు. ఈ ఆదివారం నుంచి పట్టణంలోని ప్రతి ప్రాంతంలోని ప్రతి ఇంటికి ఈ సంచులను అందిస్తామని వారు తెలియజేసారు. ఈయనతో పాటు ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories