తాహసిల్దార్ తో కలిసి భూసేకరణను పరిశీలిస్తున్న మంత్రి కొడాలి నాని

తాహసిల్దార్ తో కలిసి భూసేకరణను పరిశీలిస్తున్న మంత్రి కొడాలి నాని
x
Highlights

అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు.

గుడివాడ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం, పట్టణ పరిధిలోని బేతవోలులో ఇళ్లస్థలాల కోసం సేకరించనున్న 58 ఎకరాల భూమిని మండల తాహసిల్దార్ తో కలసి మంత్రి కొడాలి నాని పరిశీలించారు. సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా భూములు నివాసానికి అనువైనవా, కావా అన్నది స్వయంగా చూశారు.

ఇళ్ల స్థలాలకు ఈ భూములను కేటాయించిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయాల్సిన తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాల కల్పన ఏ విధంగా చేయాలన్నది పరిశీలించారు. ఆయా భూములకు పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న మహిళలతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు కేటాయించిన తర్వాత అక్కడ ఎదురయ్యే సమస్యలను అధ్యయనం చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా పెట్టుకున్నారని అన్నారు. దీనిలో భాగంగా గుడివాడ డివిజన్ లోని తొమ్మిది మండలాల్లో 31, 928 మంది లబ్ధిదారులను అర్హులుగా గుర్తించామన్నారు.

వీరందరికీ ఇళ్ల స్థలాలను కేటాయించేందుకు చర్యలు చేపట్టామని చెప్పారు. గుడివాడ డివిజన్ లో 449.38 ఎకరాల ప్రభుత్వ భూమి సిద్ధంగా ఉందన్నారు. ఇంకా 178.14 ఎకరాల ప్రైవేటు భూమిని రైతుల నుండి సేకరించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గుడివాడ పట్టణంలోని లబ్ధిదారుల కోసం 58 ఎకరాల ప్రైవేటు భూమిని సేకరించనున్నామన్నారు. గుడివాడ రూరల్ మండలం మల్లాయిపాలెం, పట్టణ పరిధిలోని బేతవోలు ప్రాంతాల్లో యాభై ఎనిమిది ఎకరాల ప్రైవేటు భూమిని గుర్తించామని, సర్వే నెంబర్ల ఆధారంగా ఆయా భూములను తాను స్వయంగా పరిశీలించానని చెప్పారు.

భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించామన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇల్లు కేటాయించే బృహత్తర కార్యక్రమానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని, ఆ దిశగా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి పేదవాడి సొంతింటి కలను నిజం చేసేందుకు కృషి చేయాలని మంత్రి కొడాలి నాని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఆర్ పాపమ్మ తదితరులు పాల్గొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories