అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో మినీ యుద్ధం

అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో మినీ యుద్ధం
x
Highlights

అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో మినీ యుద్ధం జరిగింది. అధికార-ప్రతిపక్ష నేతల వాగ్వాదంతో సభ దద్దరిల్లింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రజల్లో భయాందోళనలు...

అక్రమ కట్టడాలపై ఏపీ అసెంబ్లీలో మినీ యుద్ధం జరిగింది. అధికార-ప్రతిపక్ష నేతల వాగ్వాదంతో సభ దద్దరిల్లింది. ప్రజావేదిక కూల్చివేతతో ప్రజల్లో భయాందోళనలు పెరిగాయన్న టీడీపీ ఎమ్మెల్యే రామానాయుడు వ్యాఖ్యలతో మొదలైన గొడవ... గంటల తరబడి సాగింది. చంద్రబాబు టార్గెట్‌గా అధికార పార్టీ సభ్యులు నిప్పులు చెరగగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి సైతం ఘాటు వ్యాఖ్యలు చేశారు. 40ఏళ్ల అనుభవం ఉంటే సరిపోదని, నలుగురికీ రోల్‌ మోడల్‌గా ఉండాలంటూ విరుచుకుపడ్డారు.

అక్రమ కట్టడాల కూల్చివేతపై ఏపీ అసెంబ్లీలో హాట్‌ హాట్‌ చర్చ జరిగింది. కృష్ణానది కరకట్టపై నిర్మించిన ప్రజావేదిక కూల్చివేతతో ప్రజల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయని, తమ ఇళ్లు కూడా కూల్చేస్తారేమోనని పేదలు భయపడుతున్నారంటూ టీడీపీ సభ్యుడు రామానాయుడు వ్యాఖ్యానించడంతో సభలో దుమారం రేగింది.

అయితే, అక్రమ కట్టడాలు ఎక్కడున్నా కూల్చివేస్తామని మంత్రి బొత్స తేల్చిచెప్పారు. అయితే కరకట్ట కట్టడాలపై చంద్రబాబుకి ఎన్నిసార్లు హైకోర్టు నోటీసులిచ్చినా స్పందించలేదని, ఇప్పటికీ అక్రమ కట్టడంలోనే నివాసం ఉంటున్నారని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే నిప్పులు చెరిగారు.

అనంతరం మాట్లాడిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి.... చట్టాలను చేసినవాళ్లే చట్టాలను ఉల్లంఘించారంటూ చంద్రబాబుపై విరుచుకుపడ్డారు. ఎలాంటి అనుమతుల్లేకుండానే ప్రజావేదికను నిర్మించారంటూ లేఖలతో సహా వివరించారు. ఇలాగే అక్రమ నిర్మాణాలు కొనసాగితే, చెన్నై, ముంబై తరహాలో విజయవాడ కూడా మునిగిపోయే ప్రమాదముందని హెచ్చరించారు.

అయితే, తానుంటున్న ఇల్లు తనది కాదని, అద్దెకు ఉంటున్నానని, అవసరమైతే రోడ్డుపై పడుకుంటా తప్ప... ఎవరి బెదిరింపులకు లొంగనంటూ చంద్రబాబు కౌంటరిచ్చారు.

బాబు కామెంట్స్‌‌పై సీఎం జగన్మోహన్‌‌రెడ్డి ఘాటుగా రియాక్టయ్యారు. 40ఏళ్ల అనుభవం ఉంటే సరిపోదని, నలుగురికీ రోల్‌ మోడల్‌గా ఉండాలన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తే చట్టాలను ఉల్లంఘిస్తే, ఇక సామాన్యులు ఎలా లెక్కచేస్తారని ప్రశ్నించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories