పోలీసులకు వీక్లీ ఆఫ్‌: హోంమంత్రి సుచరిత

పోలీసులకు వీక్లీ ఆఫ్‌: హోంమంత్రి సుచరిత
x
Highlights

శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోస కల్పిస్తామన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. మహిళలు., చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడుతామని బాధితులు తమ...

శాంతి భద్రతలు కాపాడి ప్రజలకు భరోస కల్పిస్తామన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. మహిళలు., చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికడుతామని బాధితులు తమ కష్టాలు చెప్పుకునేందుకు ఫ్రెండ్లీ పోలీస్ వ్యవస్థను రూపొందింస్తామని హమీ ఇచ్చారు. అదే విధంగా పోలీస్ శాఖలో ఖాళీలను త్వరలో భర్తీ చేస్తూ పోలీసులకు వీక్లీ ఆఫ్ అమలు చేస్తామన్నారు హోంమంత్రి. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్నారు ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత. అమరావతి సచివాలయంలో రెండో బ్లాక్ లో ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలు స్వీకరించిన ఆమె పోలీస్ కానిస్టేబుల్ మెడికల్ రీయింబర్స్ మెంట్ ఫైల్ పై తొలిసంతకం చేశారు.

పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చిన హోంమంత్రి పోలీసులు కూడా వారానికి ఒకరోజు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకునేందుకు వీక్లీ ఆప్ ను అమలు చేయడానికి చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. అదే విధంగా రాష్ర్టంలో నాలుగు బెటాలియన్లు ఏర్పాటుకు కేంద్రం అవకాశం కల్పించిందని వాటిలో ఒకటి మహిళ, ఒకటి గిరిజన, బెటాలియన్ ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి చెప్పారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబర్‌ ఏర్పాటు చేస్తామని హోంమంత్రి స్పష్టం చేశారు. రాష్ట్రంలో మహిళలు, చిన్నారులపై జరుగుతున్నఅఘాయిత్యాలను అరికడతామన్నారు. అంబేంద్కర్ కల్పించిన రిజర్వేషన్ సీఎం జగన్మోహన్ రెడ్డి సహకారంతో తాను ఈ పదవి చేపట్ట గలిగానని సంతోషం వ్యక్తం చేశారు హోంమంత్రి సుచరిత.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories