తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..

తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
x
Highlights

తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండేళ్లలో ఊహించని రాజకీయ మార్పులు చోటు...

తెలుగు రాష్ర్టాల రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయం మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న రెండేళ్లలో ఊహించని రాజకీయ మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడంతో పాటు ఏపీలో ప్రత్యామ్నాయ పార్టీగా ఎదుగుతుందన్నారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే జమిలి ఎన్నికలు వస్తాయా అన్న అనుమానం కలుగుతుంది. తెలుగురాష్ట్రాల రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సందర్భంగా ఏపీలో పర్యటించిన కిషన్ రెడ్డి విజయవాడలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రానున్న రోజుల్లో తెలుగు రాష్ర్టాల్లో బీజేపీ జెండా ఎగురడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారం చేపడుతుందని ఏపీలో బలమైన పార్టీగా ఎదుగుతుందన్నారు.

తెలుగువాడిగా తనకు ఇచ్చిన బాధ్యతను నిర్విరామంగా నెరవేరుస్తూ తెలుగు రాష్ర్టాల అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు కిషన్ రెడ్డి. దేశంలో రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ప్రపంచదేశాల్లో భారత్‌ గౌరవాన్ని నిలబెట్టే విధంగా చర్యలు చేపడుతుందన్నారు. గత ప్రభుత్వాలు దేశాన్ని ఆర్ధిక అస్థిరతకు గురిచేశారని మండిపడ్డారు. స్వర్ణభారతి ట్రస్ట్ నిర్వహించిన ప్రతిభా పురస్కారం కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా హజరయ్యారు కిషన్ రెడ్డి. బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. దేశప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని. పాడిపంటలు సుభిక్షంగా ఉండాలన్ని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories