ఆంధ్రప్రదేశ్ అప్ కమింగ్ సీఎం ఎన్టీఆర్.. టీడీపీ నేత ఫ్లెక్సీ

ఆంధ్రప్రదేశ్ అప్ కమింగ్ సీఎం ఎన్టీఆర్.. టీడీపీ నేత ఫ్లెక్సీ
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో 2024 జరిగే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేసి గెలిచేదెవరని అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు అక్కడి యువత, మరికొంత మంది టీడీపీ నాయకులు....

ఆంధ్రప్రదేశ్ లో 2024 జరిగే ఎన్నికల్లో సీఎంగా పోటీ చేసి గెలిచేదెవరని అడిగితే, జూనియర్ ఎన్టీఆర్ అంటున్నారు అక్కడి యువత, మరికొంత మంది టీడీపీ నాయకులు. 2024 నాటికి తారక్ ముఖ్యమంత్రి కావడం పక్కా అని గట్టి నమ్మకంతో ఉన్నారు. ఇప్పటి నుంచే అప్ కమింగ్ సీఎం అంటూ ఫ్లెక్సీలు పెడుతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ ఇప్పుడు సోషల్ మీడియా, వాట్సాప్స్‌లో దుమారం రేపుతుంది. అంతే కాదు ఏపీ టీడీపీ శ్రేణుల్లోనూ చర్చనీయాంశంగా మారింది.

పూర్తి వివరాల్లోకెళితే ప్రకాశం జిల్లా యర్రగొండ పాలెంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంక్రాంతి సందర్భంగా ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. అందులో నియోజకవర్గ ఇంఛార్జ్ బూదాల అజితారావుకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈమె 2014, 2019 ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారు. అంతేకాదు ఆమె మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, సీనియర్ నేత కరణం బలరాంకు అనుచరురాలిగా ఉన్నారు. ఆమె చేసిన సేవలకుగాను అభిమానులు, కార్యకర్తలు ఈ ఫ్లెక్సీని ఏర్పాటు చేసారు. ఇందులో మరి కొంత మంది ముఖ్యమైన పార్టీ నేతల ఫోటోలను కూడా ముద్రించారు.

అంతే కాక వారితో పాటు జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను కూడా పెట్టారు. ఇక్కడి వరకూ బాగానే ఉండి, అసలు ట్విస్ట్ ఇక్కడ మొదలైంది. జూనియర్ ఎన్టీఆర్ ఫోటో కింద రాబోయే కాలానికి కాబోయే సీఎం, 2024 ముఖ్యమంత్రి అంటూ క్యాప్షన్ పెట్టారు. ఇదంతా ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో చేసారన్నప్పటికీ ఈ ఫ్లెక్సీలో టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో లేకపోవడం గమనార్హం. ఇంకేముంది ఈ విషయం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో ఎన్టీఆర్ నిజంగానే సీఎం అవుతాడా అన్న ఆలోచనలో అందరినీ పడేసింది.
Show Full Article
Print Article
More On
Next Story
More Stories