మాటల యుద్ధం వద్దు.. ప్రజా సమస్యలపై చర్చిద్దాం!: జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్

మాటల యుద్ధం వద్దు.. ప్రజా సమస్యలపై చర్చిద్దాం!: జనసేన ఎమ్మెల్యే వరప్రసాద్
x
Highlights

నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ కు జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో మాటల...

నవ్యాంధ్రప్రదేశ్ కు రెండో స్పీకర్ గా ఎన్నికయిన తమ్మినేని సీతారామ్ కు జనసేన రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీలో మాటల యుద్ధం చేయడం మంచిది కాదని హితవు పలికారు. అధికార వైసీపీ, విపక్ష టీడీపీలు వాగ్వాదాలు వదిలేసి ప్రజా సమస్యలపై చర్చించాలని కోరారు. ఈరోజు ఏపీ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా రాపాక వరప్రసాద్ మాట్లాడారు.

ఈరోజు సభాసంప్రదాయాల గురించి చాలామంది సభ్యులు మాట్లాడారనీ, ఇది స్వాగతించదగ్గ పరిణామమని చెప్పారు. సంఖ్యాబలం ఉన్నప్పటికీ ప్రతీ సభ్యుడు అసెంబ్లీలో మాట్లాడేలా సహకరిస్తామని ముఖ్యమంత్రి జగన్ చెప్పడాన్నిస్వాగతిస్తున్నామని తెలిపారు. అసెంబ్లీ సమావేశాలను కోట్లాది మంది ప్రజలు, చాలామంది మేధావులు పరిశీలిస్తున్నారనీ, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని సూచించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories