సుగాలి ప్రీతీ కేసులో మేము కోరిందే జరిగింది: పవన్

సుగాలి ప్రీతీ కేసులో మేము కోరిందే జరిగింది: పవన్
x
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)
Highlights

సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.

సుగాలి ప్రీతీ కేసులో తాము కోరిందే జరిగిందని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ కేసును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్‌కు అప్పగించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ పేరు పేరునా అభినందిస్తున్నట్లు చెప్పారు. మూడేళ్ళ కిందట పాఠశాలకు వెళ్లిన ప్రీతీపై అత్యాచారం, హత్య జరిగింది. ఆమె తల్లిదండ్రుల కడుపు కోత, ఆవేదన, ఆక్రందనను తాను స్వయంగా చూశానన్నారు.

తన బిడ్డ కేసులో న్యాయం కోసం ఆమె తల్లిదండ్రులు పడిన కష్టం పగవాడికి సైతం రాకూడదన్నారు. అమానుష సంఘటన గురించి విన్న తరువాత ఈ పరిస్థితి ఏ పసిపాపకూ రాకూడదని భావించానని పవన్ అన్నారు. ఆ సంకల్పంతోనే ఈ నెల 12న కర్నూలు వీధులలో సుగాలి ప్రీతీ కేసులో న్యాయం కోసం నినదించానన్నారు. చివరికి ఆ బాలిక తల్లిదండ్రులకు ఇన్నాళ్లకు స్వాంతన కలిగిందన్నారు. ఈ పోరాటంలో అండగా ఉన్న కర్నూలు ప్రజానీకానికి, పాత్రికేయులకు, ప్రజా సంఘాలకు పవన్ అభినందనలు తెలిపారు.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories