ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టులో మరోసారి షాక్‌

AP High Court: రిట్ అప్పీల్‌ను కొట్టేసిన అమరావతి హైకోర్టు

Jyothi
Published on: 14 Dec 2022 7:32 PM IST
Ippatam Petitioners Got Another Shock in the AP High Court
X

ఇప్పటం పిటిషనర్లకు ఏపీ హైకోర్టులో మరోసారి షాక్‌

AP High Court: ఇప్పటం పిటిషనర్లకు ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులో మరోసారి షాక్ తగిలింది. అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో సింగిల్‌ బెంచ్ విధించిన లక్ష రూపాయల జరిమానాను సవాల్‌ చేస్తూ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన పిటిషనర్లకు అక్కడా చుక్కెదురైంది. పిటిషనర్లు దాఖలు చేసిన రిట్‌ అప్పీల్‌ను ధర్మాసనం కొట్టేసింది. నోటీసులు ఇవ్వకుండానే నిర్మాణాలు కూల్చేశారని 14 మంది పిటిషనర్లు మోసపూరితంగా కోర్టును ఆశ్రయించినట్లు గుర్తించిన సింగిల్‌ బెంచ్‌...వారికి లక్ష రూపాయల జరిమానా విధించింది. పిటిషనర్లు అంతా రైతులేనని వాళ్లకు తెలియక తప్పు చేశారని ధర్మాసనం ముందు అప్పీలుకు వెళ్లారు. పిటిషనర్లకు తెలియకపోయినా న్యాయవాదులకు తెలియదా అని కోర్టు ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేయరాదని ధర్మాసనం అభిప్రాయపడింది.

Jyothi

Jyothi

Next Story