ఓ ప్రాథమిక పాఠశాలలో భార్య స్థానంలో భర్త విధులకు హాజరు

* గర్భిణిగా ఉండడంతో ప్రధానోపాధ్యాయురాలు విధులకు గైర్హాజరు

R Tripura Malini
Updated on: 18 Dec 2022 6:25 PM IST
In A Primary School Husband Attends Duties Instead Of Wife
X

ఓ ప్రాథమిక పాఠశాలలో భార్య స్థానంలో భర్త విధులకు హాజరు

Vijayawada: కృష్ణా జిల్లా తొట్లవల్లూరు మండలం పెనమకుర్రు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో భార్య స్థానంలో భర్త విధులకు హాజరయ్యారు. స్థానిక మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు గర్భిణిగా ఉండడంతో విధులకు గైర్హాజరు అయింది. దీంతో ప్రధానోపాధ్యాయురాలు భర్త విధులకు హాజరవడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై సదరు టీచర్‌ని ఫోన్‌లో వివరణ అడగ్గా.. తనకు ఆరోగ్యం బాగాలేనందున తన భర్తను పాఠశాలకు పంపానని సమాధానం చెప్పింది. ఈ విషయాన్ని ఎంఈఓకు కూడా తాను సమాచారం అందించానని ప్రధానోపాధ్యాయురాలు మీడియాకు ఫోన్‌లో తెలిపింది.

R Tripura Malini

R Tripura Malini

Next Story