logo

కర్నూలు జిల్లాలో కుంభవృష్టి

కర్నూలు జిల్లాలో కుంభవృష్టి
Highlights

కర్నూలు జిల్లాలో భారీ వర్షం కురిసింది. వాగులు వంకలు పొంగిపోర్లడంతో రహదారులన్నీ చెరువులను తలపిస్తున్నాయి.

కర్నూలు జిల్లాలో సోమవారం భారీ వర్షం కురిసింది. పట్టణంలో రెండు గంటల పాటు కురిసిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. దీంతో వాహనదారుల రాకపోకలు నిలిచిపోయాయి దీంతో కర్నూలు-చెన్నై హైవేపై రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. జిల్లాలోని నంద్యాల, గోస్పాడు, బనగానపల్లె, సరివెళ్లలో సహా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. జిల్లెలవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. వాగులు వంకలు పొంగిపోర్లడంతో ఎర్రగుంట్ల గ్రామంలోని వేల ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగాయి. వర్షపునీరు ఇళ్లలోకి వచ్చి చేరింది. దీంతో వారిని అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పలు గ్రామల్లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.


లైవ్ టీవి


Share it
Top