గ్రామవాలంటీర్‌ ఆత్మహత్యాయత్నం

ప్రతీకాత్మక చిత్రం
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

గ్రామవాలంటీర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఓబులదేవరచెరువు పంచాయతీకి చెందిన గ్రామవాలంటీర్‌ గోపీనాథ్‌ ఉరివేసుకుని...

గ్రామవాలంటీర్‌ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన అనంతపురం జిల్లాలో జరిగింది. ఓబులదేవరచెరువు పంచాయతీకి చెందిన గ్రామవాలంటీర్‌ గోపీనాథ్‌ ఉరివేసుకుని బలవణ్మరణానికి యత్నించాడు. గ్రామవాలంటీర్‌ను కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

వేమరెడ్డిపల్లికి చెందిన గోపీనాథ్‌కు‌ పెన్షన్ల పంపిణీ కోసం పంచాయతీ సెక్రెటరీ గౌస్‌ 94 వేల రూపాయలు ఇచ్చాడు. అయితే ఆ డబ్బులు తిరిగి తనకు అప్పగించాలని పంచాయతీ సెక్రెటరీ కోరాడు. కానీ ఆసమయంలో గ్రామవాలంటీర్‌ అందుబాటులో లేకపోవడంతో అతని ఇంటికి వెళ్లి అతని తల్లిదండ్రులకు విషయాన్ని తెలియచేశాడు.

దీంతో విషయం తెలుసుకున్న గ్రామవాలంటీర్‌ గోపీనాథ్‌ ఊరి బయట ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతనిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు.Show Full Article
Print Article
More On
Next Story
More Stories