ప్రభుత్వాస్పత్రిలో టిక్‌ టాక్‌.. ఊడిన ఉద్యోగం

ప్రభుత్వాస్పత్రిలో టిక్‌ టాక్‌.. ఊడిన ఉద్యోగం
x
Highlights

టిక్‌ టాక్‌ వైరస్‌.. ప్రభుత్వ ఉద్యోగులను వదలడం లేదు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నా.. వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి...

టిక్‌ టాక్‌ వైరస్‌.. ప్రభుత్వ ఉద్యోగులను వదలడం లేదు. ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నా.. వాళ్లు మాత్రం మారడం లేదు. తాజాగా అనంతపురం జిల్లా కదిరి ప్రభుత్వాస్పత్రిలో ల్యాబ్‌ టెక్నీషియన్స్‌.. సద్గుణ, శైలజా టిక్‌ టాక్‌ వీడియోలు చేశారు. ఓ వైపు పరీక్షల కోసం రోగులు క్యూ కట్టిన సమయంలోనే.. టిక్‌ టాక్‌ వీడియోలు చేశారు. రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో.. ఉన్నతాధికారులు.. ఇద్దరినీ విధుల నుంచి తొలగించారు. రక్త పరీక్ష కోసం వచ్చిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన సూపరింటెండెంట్‌.. జిల్లా వైద్య అధికారుల ఆదేశంతో.. సద్గుణ, శైలజలను విధుల నుంచి తొలగించి మెమోలు అందజేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories