గోదావరి వరదతో నీట మునిగిన లంక ప్రాంతాలు

గోదావరి వరదతో నీట మునిగిన లంక ప్రాంతాలు
x
Highlights

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి వరదనీరు...

ఎగువ ప్రాంతాల్లో అధిక వర్షాలు కారణంగా గోదావరికి వరదనీరు పోటెత్తుంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నుంచి సముద్రంలోకి వరదనీరు విడిచిపెట్టడంతో కోనసీమలోని పలు లంక ప్రాంతాలు నీట మునిగాయి. రావులపాలెంలోని గౌతమీ గోదావరి, గోపాలపురంలోని వశిష్ట గోదావరి పాయలు ఉరకలుపెడుతున్నాయి. కొత్తపేట నియోజకవర్గంలోని రావులపాలెం, ఆత్రేయపురం, ఆలమూరు, కొత్తపేట మండలాల్లోని లంక భూములు కోతకు గురవుతున్నాయి.

వరద తగ్గినట్టే తగ్గి పెరగడంతో లంక ప్రాంతాల్లోని అరటి, మునగ, కూరగాయల తోటలు పూర్తిగా నీటమునిగాయి. ఆలమూరు మండలంలోని బడుగువానిలంక, మూలస్థానం, చొప్పెళ్ల, జొన్నాడ లంకల్లో భూములు భారీగా కోతకు గురిఅవుతున్నాయి. రెండు మూడు రోజుల తోటలు నీటిలో ఉంటే పూర్తిగా కుళ్లిపోయిపాడైపోతాయని తాము నష్టపోతామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories