Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: మరో 15 మందికి గాయాలు, తెనాలి ఆస్పత్రికి తరలింపు

Jyothi
Published on: 5 Dec 2022 9:46 AM IST
Four Ayyappa Devotees Were Killed and Many injured in a Road Accident in Bapatla District
X

Road Accident: బాపట్ల జిల్లాలో రోడ్డు ప్రమాదం.. నలుగురు అయ్యప్ప భక్తులు మృతి

Road Accident: బాపట్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో బోల్తాపడటంతో నలుగురు అయ్యప్ప భక్తులు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 15 మందికి గాయపడ్డారు. వేమూరు మండలం జంపని దగ్గర టాటాఏస్ వాహనం బోల్తా పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతులను కృష్ణాజిల్లా వాసులుగా గుర్తించారు. గాయపడిన వారిని తెనాలి ఆస్పత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

శబరిమల నుంచి తెనాలి వరకు ట్రైన్ లో వచ్చిన అయ్యప్ప భక్తులు.. అక్కడి నుంచి ఆటోలో బయలుదేరారు. తెల్లవారుజామున మంచు ఎక్కువగా ఉండటంతో జంపని దగ్గరకు వచ్చే సరికి టర్నింగ్ కనపడక ఆటో బోల్తా పడింది. ఘటన స్థలంలో ముగ్గురు మృతిచెందగా.. తెనాలి ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరోకరు మృతి చెందారు. ప్రమాదం సమయంలో ఆటోలో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు.

Jyothi

Jyothi

Next Story