సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌లో కబడ్డీ క్రీడాకారుల మధ్య వివాదం

సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌లో కబడ్డీ క్రీడాకారుల మధ్య వివాదం
x
Highlights

కబడ్డీ క్రీడాకారులు బరిలో ఆటను మాని.. ఫైట్ చేసుకున్నారు. బస్తీమే సవాల్ అంటూ ఇరుజట్ల వారు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు....

కబడ్డీ క్రీడాకారులు బరిలో ఆటను మాని.. ఫైట్ చేసుకున్నారు. బస్తీమే సవాల్ అంటూ ఇరుజట్ల వారు ఒకరిపై ఒకరు దాడికి దిగారు. కుర్చీలు విసురుకున్నారు. పిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటన సూళ్లూరుపేట ఫ్లెమింగో ఫెస్టివల్‌లో జరిగింది.

ఎదురుకుప్పం, కాసింగాడికుప్పం కబడ్డీ టీంల మధ్య వివాదం రేగి.. అది కాస్త ఘర్షణకు దారి తీసింది. క్రీడా ప్రాంగణంలోనే ఆటగాళ్లు కొట్టుకున్నారు. గతం నుంచే ఈ రెండు గ్రామాలకు చెందిన టీంలకు మధ్య విభేదాలు ఉన్నాయి. అవికాస్త ఇప్పుడు తీవ్రమయ్యాయి. దీంతో రెండు గ్రామాల వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories