Top
logo

వైసీపీని వీడే యోచనలో మరో నేత..

వైసీపీని వీడే యోచనలో మరో నేత..
X
Highlights

ఎన్నికల ముందు జంపింగులు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీనుంచి వైసీపీకి.. వైసీపీనుంచి టీడీపీకి కొందరు నేతలు...

ఎన్నికల ముందు జంపింగులు ఊపందుకున్నాయి. ఇప్పటికే టీడీపీనుంచి వైసీపీకి.. వైసీపీనుంచి టీడీపీకి కొందరు నేతలు చేరిపోయారు. ఈ క్రమంలో అక్కడక్కడా అసంతృప్తులు ఉన్నా రెండు పార్టీలు కేర్ చెయ్యడం లేదు. ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే, వైసీపీ మహిళా నాయకురాలు పిడతల సాయికల్పనారెడ్డి టీడీపీ చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. మంగళవారం రాత్రి సాయికల్పనారెడ్డి, ఆమె కుమారుడు అభిషేక్‌ రెడ్డి సీఎం చంద్రబాబును కలిసినట్టు సమాచారం. వారు గిద్దలూరు అసెంబ్లీ టికెట్ కోరుతున్నారు.

అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ముత్తుముల అశోక్ రెడ్డి ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో వైసీపీనుంచి గెలిచి టీడీపీలో చేరారు. అశోక్ రెడ్డి టీడీపీలో చేరడంతో టీడీపీ నుండి పోటీ చేసిన అన్నా రాంబాబు వైసీపీలో చేరిపోయారు. వైసీపీలో దాదాపు ఆయనకే సీటు కన్ఫామ్ చేశారు జగన్.. ఈ పరిమాణం సాయికల్పనకు రుచించలేదు. దాంతో తన వర్గం నేతలతో కలిసి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇక టీడీపీలో కూడా అశోక్ రెడ్డికే టికెట్ ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారు. ఈ క్రమంలో సాయికల్పనారెడ్డి చంద్రబాబును కలవడంతో ప్రాధాన్యత సంతరించుకుంది.

Next Story