చంద్రబాబు ఇక్కడికే మారబోతున్నారా?

చంద్రబాబు ఇక్కడికే మారబోతున్నారా?
x
Highlights

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తప్పనిసరి పరిస్థితిలో తమ నివాసాన్ని వెంటనే మార్చుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసం...

టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి తప్పనిసరి పరిస్థితిలో తమ నివాసాన్ని వెంటనే మార్చుకోవాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఉంటున్న నివాసం అక్రమ కట్టడామనీ..దానిని త్వరలోనే ప్రభుత్వం కూల్చివేయనున్నదనీ ప్రచారం జరుగుతున్నా నేపథ్యంలో.. చంద్రబాబు హుటాహుటిన విజయవాడ లో కొత్త నివాసం కోసం వెదుకులాట ప్రారంభించారు. ఇప్పటికే రెండు పెద్ద బంగ్లాలను తదుపరి నివాసానికి ఎంపిక చేసుకున్నారని సమాచారం. విజయవాడ భారతీ నగర్ 7 వ నెంబర్ రోడ్డులోని క్వాలిటీ ఐస్ క్రీమ్స్ సుధాకర్ గెస్ట్ హౌస్, కామినేని ఆసుపత్రి ఎదురుగా ఉన్న గ్రావెల్ ఇండియా భవనం రెండిటినీ ప్రాథమికంగా ఎంపిక చేసుకున్నారని తెలుస్తోంది. అయితే, కామినేని ఆసుపత్రి ఎదురుగా ఉన్న భవనం తమకు అన్నివిధాలా అనుకూలంగా ఉంటుందని చంద్రబాబు భావిస్తున్నట్టు చెబుతున్నారు. దాదాపుగా దీనినే ఖాయం చేశారని తెలుగుదేశం పార్టీనేతలు అంటున్నారు. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories