రాష్ట్రంలో తొలి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు

రాష్ట్రంలో తొలి రైతు భరోసా కేంద్రం ఏర్పాటు
x
Highlights

రైతులకు ప్రభుత్వ స్టాంప్ తోపాటు నాణ్యతతో కూడిన విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లను అందించేందుకు నిర్ధేశించిన రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్...

రైతులకు ప్రభుత్వ స్టాంప్ తోపాటు నాణ్యతతో కూడిన విత్తనాలు, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ లను అందించేందుకు నిర్ధేశించిన రైతు భరోసా కేంద్రాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా ప్రారంభిపజేస్తోంది. రాష్ట్రంలోని తొలి రైతు భరోసా కేంద్రాన్ని పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రారంభించింది ప్రభుత్వం . జిల్లాలోని నజ్జజర్లలో ఈ కేంద్రాన్ని శుక్రవారం అధికారులు ప్రారంభించారు. రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి రాష్ట్రంలో గ్రామ సచివాలయాల పక్కనే రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అంతేకాదు మొత్తం 11 వేల 158 రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమోదించింది.

ఇందులో 3300 కేంద్రాలను ఫ్రిబ్రవరి నాటికి ఏర్పాటు చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ నాటికి మిగిలిన కేంద్రాలను కూడా ఏర్పాటు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామ సచివాలయాల్లోని వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, పశు సంవర్ధకశాఖ సహాయకులు ఈ కేంద్రాల్లో సేవలందించనున్నారు. అంతేకాదు బ్యాంకులకు సంబంధించి కూడా ఒకరు ఉంటారు. ఇక రైతు భరోసా కేంద్రాల్లో భూసార పరీక్షలు కూడా నిర్వహిస్తారు. రైతులు ఎక్కడైనా విత్తనాలు కొనుగోలు చేసి తెచ్చుకున్నా వాటి నాణ్యతను వీటిలో పరీక్షించుకోవచ్చని ప్రభుత్వం చెబుతోంది.

ప్రకృతి వ్యవసాయం పట్ల రైతులకు అవగాహన కల్పించేలా, వ్యవసాయంలో నూతన విధానాలను అందించేలా వర్క్ షాపులను రైతు భరోసా కేంద్రాల ద్వారా జరపనున్నారు. ఇకనుంచి పశువులకు కూడా హెల్త్ కార్డులు, పంట బీమా కార్డులను ఈ కేంద్రాలు జారీ చేస్తాయి. రైతులకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చే నిర్ణయాన్ని కూడా ఈ కేంద్రాలు చూస్తాయి.

ఇదిలావుంటే రైతు భరోసా పథకంలో భాగంగా ప్రతి రైతుకు సంవత్సరానికి రూ .13500 లు ఇస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మొత్తాన్ని పెట్టుబడి సాయం కింద పరిగణించాలని పేర్కొన్న సంగతి తెలిసిందే. రాష్ట్రం లోని కౌలు రైతులు సహా దాదాపు 50 లక్షల మందికి రైతు భరోసా ఇస్తోంది ప్రభుత్వం.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories