Tirumala: నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహనంపై శ్రీవారి దర్శనం

Tirumala: తిరుమాడ వీధుల్లో ఊరేగిన శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి

Jyothi
Published on: 30 Oct 2022 7:39 AM IST
Darshan of Srivari on Pedda Sesha Vahana on the Occasion of Nagula Chavithi
X

Tirumala: నాగుల చవితి సందర్భంగా పెద్దశేష వాహనంపై శ్రీవారి దర్శనం

Tirumala: కార్తీకమాసం నాగుల చవతిని పురస్కరించుకుని తిరుమలలో పెద్ద శేష వాహన సేవ వేడుకగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు పెద్ద శేషునిపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రధానం చేసారు. బంగారు, వజ్ర, వైడూర్య, మరకత, మాణిక్యాలతో కూడిన ఆభరణాలు, సుగంధ సువాసనలు వెదజల్లే పుష్పాలతో విశేషంగా ఆలంకరించి మలయప్ప తిరుమాడ వీధులలో ఊరేగిన వైనాన్ని వీక్షించిన భక్తులు పరమ పునీతులయ్యారు. నిరంతరాయంగా చిరుజల్లుల వర్షం కురుస్తున్నప్పటికి భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళవాయిద్యాల నడుమ ఆడంభరంగా సాగింది. ఈ వాహన సేవలో టీటీడీ ఉన్నతాధికారులు మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Jyothi

Jyothi

Next Story