ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైకాపా ప్రభుత్వం కాపాడాలి : తులసి రెడ్డి కామెంట్స్..

ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైకాపా ప్రభుత్వం కాపాడాలి : తులసి రెడ్డి కామెంట్స్..
x
Tulasi Reddy (file photo)
Highlights

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 4 వ తేదీ కృష్ణ బోర్డు సమావేశం జరగనుంది.

ఆంధ్రప్రదేశ్ లో ఈ నెల 4 వ తేదీ కృష్ణ బోర్డు సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్వహించిన మీడియా సమావేశంలో తులసి రెడ్డి మాట్లాడుతూ 4 వ తేదీ జరగబోయే కీలకమైన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను వైకాపా ప్రభుత్వం కాపాడాలని లేదంటే వైకాపా పార్టీ సీమాంద్ర ద్రోహి గా మిగిలిపోతుందని ఆయన అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వం సమర్ధవంతమైన వాదనలు వినిపించాలని ఆయన అన్నారు.

* ప్రతి ఏడాది కృష్ణానది లో 2130 టిఎంసిల నికరజలాలు నిల్వ వుంటాయని నిర్దారణ అయిందన్నారు. కృష్ణానదిలో నిల్వ ఉండే 2130 టిఎంసిల నికర జలాల్లో మహారాష్ట్రకు 522 టియంసిలు, కర్ణాటకకు 734 టియంసిలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు 811 టియంసిల నికర జలాలు కేటాయిస్తున్నారు.

* ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు కేటాయించిన 811 టియంసి ల నికర జలాల్లో తెలంగాణ ప్రాజెక్టులకు 299 టియంసీలను, సీమాంధ్ర ప్రాజెక్టులకు 512 టియంసీలను కేటాయిస్తున్నారు.

* ఎగువ ప్రాంతమైన తెలంగాణ నీటి కేటాయింపునకు విరుద్ధంగా సీడబ్ల్యూసీ అనుమతి లేకుండా కృష్ణా బోర్డు అనుమతి లేకుండా 179 టియంసీల నీటిని అక్రమంగా తీసుకెళ్లేందుకు 8 ప్రాజెక్టులను నిర్మిస్తుందన్నారు.

* రాష్ట్ర విభజన తరువాత మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణలు ఎగువ ప్రాంతాలు అవుతాయనీ, మిగులు జలాలను వాడుకునే స్వేచ్ఛ దిగువ రాష్ట్రం ఐన ఒక్క సీమాంధ్రప్రదేశ్ కు మాత్రమే ఉందని. అందుకే ప్రాజెక్టులు కట్టుకునే స్వేచ్ఛ ఒక ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే ఉంటుందన్నారు.

* ఇప్పటికే నికర జలాల ఆధారంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులు కొన్ని పూర్తి అయ్యాయని మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.

* నీరు లేక 8 ప్రాజెక్టుల కింద సీమాంధ్ర జిల్లాల్లో 48 లక్షల ఎకరాలు బీడు భూములు తయారయి కరువు ఏర్పడుతుందన్నారు. జల విద్యుత్ ఉత్పత్తి అవదు,పరిశ్రమలు మూత పడతాయి కొత్త పరిశ్రమలు రావని ఆయన అన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories