కోడి పందాలు నిర్వహిస్తే కటకటాలే..!

కోడి పందాలు నిర్వహిస్తే కటకటాలే..!
x
ప్రతీకాత్మక చిత్రం
Highlights

ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందటే చాలు కోడి పందాలు నిర్వహించడం, పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో పందాల...

ప్రతి ఏటా సంక్రాంతి పండుగ వచ్చిందటే చాలు కోడి పందాలు నిర్వహించడం, పేకాట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. ఇదే తరహాలో ఈ ఏడాది కూడా కొన్ని ప్రాంతాల్లో పందాల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసకునున్నారు. మరికొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే సంక్రాంతికి ముందు నుంచే కోడిపందేలు, పేకాట తదితర జూద క్రీడలు ప్రారంభించారు.

వీటిన్నింటినీ చెక్ పెట్టేందుకు న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. దీంతో ఈ సారి కోడిపందేలు నిర్వహించే వారిని, జూదం ఆడే వారిని అడ్డుకునేందుకు పోలీసులు, రెవెన్యూ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఇదే కోణంలో కోడి పందాలు, పేకాట ఆడకూడదని పోలీసులు తెలుపుతున్నారు. అయినప్పటికీ ప్రతి జిల్లాల్లో ఎక్కడో ఒక చోట గుట్టుచప్పుడు కాకుండా పందేలు నిర్వహిస్తున్నారు. గతంలో సంక్రాంతి పండుగ ముందురోజు హడావుడిగా బరి ప్రాంతాలను శుభ్రం చేసి చదునుచేసి టెంట్లు ఏర్పాటు చేసి పందేలను నిర్వహించే వారు. కానీ ప్రస్తుత కాలంలో పోలీసులు, ప్రభుత్వాలు ఈ పందాలను రద్దు చేయడంతో పందేలు నిర్వహణ తీరులో మార్పులు సంతరించుకుంటున్నాయి.

ఇదే కోణంలో విజయవాడ కమిషనరేట్‌ పరిధిలోని గన్నవరం, కంకిపాడు, ఉంగుటూరు, తోట్లవల్లూరు, నున్న, ఆత్కూరు పరిధిల్లో ఇలాంటి అనధికార బరులను పదకొడింటిని పోలీసులు గుర్తించారు. పలుచోట్ల స్థలాలను శుభ్రం చేసి సిద్ధంగా ఉంచుతున్నట్లు గుర్తించారు. అడిగితే సంక్రాంతికి ఆధ్యాత్మిక కార్యక్రమాల నిర్వహణ నిమిత్తం స్థలాన్ని చదునుచేశామని చెబుతున్నారు. దీంతో అధికారులు వారిని ఏమీ అనలేక పోతున్నారు. ఒక వేళ సాంప్రదాయ ముసుగులో ఈ పందాలను నిర్వహిస్తే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ప్రతి గ్రామాల్లోనూ బందోబస్తు ఏర్పాట్లను పూర్తి చేసారు.




Show Full Article
Print Article
More On
Next Story
More Stories