మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా వదిలేది లేదు: సీఎం జగన్

మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా వదిలేది లేదు: సీఎం జగన్
x
Highlights

మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా వదిలేది లేదన్నారు ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి. అవినీతి జరిగిందని తేలితే చర్యలు తీసుకోవాల్సిందేనని...

మాజీ సీఎం అయినా, మాజీ మంత్రులైనా వదిలేది లేదన్నారు ఏపీ ముఖ‌్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌‌రెడ్డి. అవినీతి జరిగిందని తేలితే చర్యలు తీసుకోవాల్సిందేనని అధికారులకు ఆదేశించారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతామన్న జగన్‌ కేబినేట్‌ సబ్‌ కమిటీని కూడా ఏర్పాటు చేశారు. తక్కువ రేటుకు కరెంటు దొరుకుతున్నా ఎక్కువ ముట్టజెప్పి ఎందుకు కొనుగోలు చేశారనిజగన్ ప్రశ్నించారు. ఏపీ విద్యుత్‌ శాఖ తీవ్ర నష్టాల్లో కూరుకుపోయింది. 2019 మే నాటికి డిస్కంలు విద్యుత్‌ ఉత్పత్తిదారులకు చెల్లించాల్సిన మొత్తం బకాయిలు 18 వేల 375 కోట్లకు చేరాయి. అలాగే ప్రభుత్వం డిస్కంలకు చెల్లించాల్సిన మొత్తం 10 వేల 400 కోట్లకు చేరింది. ఇన్నివేల కోట్ల బకాయిలతో మొత్తంగా విద్యుత్తు రంగం పూర్తిగా మునిగే పరిస్థితి ఉందని ముఖ్యమంత్రి జగన్ అన్నారు.

ప్రభుత్వ విద్యుత్‌ సంస్థల నుంచి యూనిట్‌ కరెంటు 3 రూపాయల 25 పైసలకు వచ్చే అవకాశం ఉన్నా విండ్‌–సోలార్‌ కు అధిక కేటాయింపులు చేయడం వెనుకున్న మతలబు ఏంటని సీఎం ప్రశ్నించారు. మూడేళ్లలో కేవలం విండ్‌ అండ్‌ సోలార్‌ ద్వారా 2 వేల 636 కోట్లు డిస్కంలకు నష్టం వాటిల్లిందని సీఎం సమీక్షలో వెల్లడయింది. బయట రాష్ట్రాల్లో ఒక మెగావాట్‌ తయారీకి 4.49 కోట్లు నుంచి 4.64 కోట్లు ఖర్చుచేస్తుంటే, అంతకంటే తక్కువ సామర్థ్యం ఉన్న విద్యుత్‌ కేంద్రాల్లో మెగావాట్‌ ఉత్పాదక సామర్థ్యం కోసం దాదాపు 7 కోట్లు ఎందుకు వెచ్చించాల్సి వచ్చిందని సీఎం ప్రశ్నించారు.

అలాగే ల్యాంకో స్పెక్ట్రంతో 2016 నాటికి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ముగిసినా స్వల్పకాలిక పీపీఏలు కుదుర్చుకుని, యూనిట్‌ కరెంటును 40 పైసలు అదనంగా పెట్టి 3 రూపాయల 70 పైసలకు కొనుగోలు చేయడంపై సీఎం ఆరాతీశారు. ఇటు జీఎంఆర్‌ వేమగిరి సంస్థతో విద్యుత్‌ కొనుగోలు ఒప్పందం ప్రకారం యూనిట్‌కు 3 రూపాయల 29 పైసలకు కొనే అవకాశం ఉన్నా ఎందుకు కొనుగోలు చేయలేదని ప్రశ్నించారు. దీనివల్ల ప్రభుత్వానికి ఏటా 92 కోట్ల మేర అదనపు భారం పడిందని, మూడేళ్లలో 276 కోట్లకుపైగా ఖజానకు నష్టం వాటిల్లిన అంశం సమావేంలో బయటకు వచ్చింది. ప్రభుత్వ లక్ష్యం అధికారులపై కాదని పైస్థాయిలో జరిగిన అవినీతిపైనే అని జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రానికి 2 లక్షల 58 వేల కోట్ల అప్పులు ఉన్నాయని దీనిపై వడ్డీలు, ఇతర రూపంలో 40 వేల కోట్లు చెల్లించాల్సి వస్తుందని జగన్ అన్నారు. ఇలాంటి పరిస్థితి నుంచి బయటపడాలని అందుకు అధికారులు సహాయం చేయాలని సీఎం విజ్ఞప్తి చేశారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories