CM Jagan: ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్న సీఎం

Jyothi
Updated on: 19 Sept 2022 9:00 AM IST
CM Jagan Visit to Kuppam on 22nd of this Month
X

CM Jagan: ఈనెల 22న కుప్పంలో సీఎం జగన్‌ పర్యటన

CM Jagan: ఈనెల 22న సీఎం జగన్‌.. కుప్పంలో పర్యటించనున్నారు. 66కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. తొలిసారిగా ముఖ్యమంత్రి కుప్పంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు, పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. కుప్పం పట్టణంలో రోడ్ షో నిర్వహించి, టీడీపీకి గట్టి పోటీనివ్వాలని ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగానే చేయూత పథకాన్ని అక్కడే ప్రారంభించబోతున్నారు. భారీ బహిరంగ సభ అనంతరం పార్టీ క్యాడర్‌తో సీఎం సమావేశం కానున్నారు. ఇదిలా ఉంటే.. 175/175 నినాదంతో మైండ్ గేమ్ స్టార్ట్ చేసిన వైసీపీ.. కుప్పమే స్టార్టింగ్ పాయింట్ కావాలని పిలుపునిచ్చింది. చంద్రబాబుకు పొలిటికల్‌గా చుక్కలు చూపించాలంటే కుప్పంలో హీట్ పెంచాలని గట్టిగా ప్రయత్నిస్తోంది.

Jyothi

Jyothi

Next Story