Top
logo

వైఎస్సార్‌ని ఫాలో అవుతున్న ఏపీ సీఎం జగన్

వైఎస్సార్‌ని ఫాలో అవుతున్న ఏపీ సీఎం జగన్
Highlights

పాదయాత్రలోనే కాదు, పరిపాలనలో కూడా వైఎస్సార్‌ని ఫాలో అవుతున్నారు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. వైస్సార్ చేపట్టాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం జగన్ మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు.

పాదయాత్రలోనే కాదు, పరిపాలనలో కూడా వైఎస్సార్‌ని ఫాలో అవుతున్నారు ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్. వైస్సార్ చేపట్టాలనుకున్న రచ్చబండ కార్యక్రమాన్ని సీఎం జగన్ మొదలు పెట్టేందుకు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే పాలనలో తన మార్కు చూపిన జగన్.. రచ్చబండ ద్వారా ప్రజలకు చేరువ కావడానికి కార్యాచరణ రూపొందించారు. సెప్టెంబర్ రెండు నుంచి రచ్చబండ ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు రెడీ అయ్యారు సీఎం జగన్.

ఏపీ సీఎం జ‌గ‌న్ త‌న తండ్రి పాల‌నను గుర్తు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన కార్యక్రమాల‌ను జ‌గ‌న్ అనుస‌రిస్తున్నారు. వైఎస్సార్ త‌రువాత ముఖ్య‌మంత్రులు వ‌దిలేసిన కార్యక్రమాల‌ను జ‌గ‌న్ తిరిగి ప్రారంభిస్తున్నారు. అధికారం చేపట్టిన మొదటి రోజు నుంచే ఏపీ పాలనను పట్టాలెక్కించేందుకు వడివడిగా నిర్ణయాలు తీసుకున్నారు సీఎం జగన్. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు మంత్రులను పరుగులు పెట్టించారు. సరైన వారిని సరైన స్థానాల్లో నియమించారు. ఈ మూడు నెలల్లో పాలన తీరు, వ్యవస్థ పనితీరును అర్థం చేసుకోవడానికి అన్ని విభాగాలతో సమీక్షలు జరిపారు. దూకుడుగా ముందుకెళ్లారూ.

అయితే ఎంతో దిగ్విజయంగా ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో అమలవుతున్నాయా లేదా..? ప్రజలు ఏమనుకుంటున్నారు..? ఇలా ఎన్నో అనుమానాలు జగన్ లో కలుగుతున్నాయని సమాచారం. అందుకే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు తెలుసుకునేందుకే సెప్టెంబర్ నుంచి జగన్ రచ్చబండను మొదలుపెట్టనున్నారు. 2009లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇదే రచ్చబండ ప్రారంభానికి వెళ్తూ హెలిక్యాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఇప్పుడు తండ్రి వదలిన అదే రచ్చబండ కార్యక్రమాన్ని అదే చిత్తూరు జిల్లా నుంచి జగన్ ప్రారంభిస్తుండటం విశేషంగా చెప్పవచ్చు.లైవ్ టీవి


Share it
Top