ఏపీలో రేపటి నుంచి బస్సులు..నిబంధనలు వర్తిస్తాయి!

ఏపీలో రేపటి నుంచి బస్సులు..నిబంధనలు వర్తిస్తాయి!
x
Highlights

లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులను రేపటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి.

లాక్ డౌన్ నేపథ్యంలో డిపోలకే పరిమితమైన ఏపీఎస్ఆర్టీసీ బస్సులను రేపటి నుంచి పున:ప్రారంభం కానున్నాయి. సీఎం ఆదేశాల మేరకు అధికారులు బస్‌ సర్వీసులు పునరుద్ధరించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. రాష్ట్రంలో వివిధ నగరాలు, పట్టణాల మధ్య ఓ బస్టాండ్‌ నుంచి మరో బస్టాండ్‌ వరకే బస్సులు నడిపేలా అధికారులూ ఏర్పాట్లు చేశారు. బస్సు సర్వీసుల పునరుద్ధరణపై ఆర్టీసీ ఎండీ మంగళవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమైన విషయాలను తెలిపారు. ఆర్టీసీ బస్సుల్లో సీట్లు తగ్గినా ఫర్వాలేదు ప్రయాణికుల క్షేమమే ముఖ్యమని స్పష్టం చేశారు.

బస్సుల్లో ప్రయాణికులు భౌతికదూరం పాటించేలా ఏర్పాట్లు చేసారు.

♦ టికెట్ బుకింగ్ లను ఆన్ లైన్ లోనే చేసుకోవాలని రిజర్వేషన్ ఫీజు ఉండదు.

♦ క్రెడిట్ కార్డు..డెబిట్ కార్డు..గూగుల్ పే లాంటి అన్ని రకాల వేలెట్ ల ద్వారా టికెట్స్ బుక్ చేసుకోవచ్చు.

♦ బస్సుల్లో ఇంతకు ముందులాగా టికెట్లు అమ్మరు.

♦ అత్యవసర పరిస్థితుల్లో తప్పితే చిన్న పిల్లలు, 60 సంవత్సరాలు దాటిన వారికి బస్సులో ప్రవేశం ఉండదు.

♦ ప్రయాణం చేసేటప్పుడు ప్రతి ఒక్క ప్రయాణికుని ఫోన్లో ఆరోగ్య సేతు యాప్ ఉండాలి.

♦ ముందస్తు చర్యల్లో భాగంగా బస్సులో ప్రయాణం చేసిన ప్రయాణికుల పూర్తి వివరాలను తీసుకుని భద్రపరుస్తారు.

♦ ప్రస్తుతం ఎండాకాలం కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని a/c బస్సులను కూడా నడపనున్నారు. కానీ దుప్పట్లు మాత్రం ఇవ్వరు.

♦ ఏసీని కేవలం 26 డిగ్రీలతో మాత్రమే నడుపనున్నారు.

♦ లాక్ డౌన్ ని ముందు ఏ చార్జీలతో ప్రయాణం చేసేవారో ప్రస్తుతం అదే చార్జీలతో ప్రయాణించవచ్చు. ఎటువంటి బస్సు చార్జీలు పెంచట్లేదు.

♦ రేపు ఉదయం 7 గంటలకు తొలి బస్సు సర్వీస్ ప్రారంభించనున్నారు.

♦ నెమ్మదిగా ఆర్ధిక వృద్ధి పెంచే దిశగానే బస్సు సర్వీసులు పెంచనున్నారు.

♦ కాబట్టి 17% సర్వీసులు అంటే 1683 బస్సులు మాత్రమే ప్రారంభిస్తున్నారు.

♦ ఈ రెండు నెలల లాల్ డౌన్ కారణంగా ఆర్టీసీ కి 1200 కోట్ల రూపాయల వరకూ నష్టం వాటిల్లింది.

♦ సిటీ బస్సు సర్వీసులు కొద్ది రోజుల తరువాత ప్రారంభించనున్నారు.

♦ అంతర్రాష్ట్ర సర్వీసులుపై నిషేధం విధించారు.

♦ ప్రయాణికుల సౌకర్యార్ధం నైట్ జర్నీ కూడా అమలు చేస్తున్నారు.

♦ రాత్రిపూట కర్ఫ్యూ ఉన్నప్పటికీ వేసవి కాలాన్ని దృష్టి లో పెట్టుకుని రాత్రి పూట బస్సులు నడుపనున్నారు.

♦ నైట్ జర్నీ చేయాలనుకునే ప్రయాణికులు బస్ స్టాండ్ కి రాత్రి 7 లోపు చేరుకోవాలన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories