YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం..'ప్రజావేదిక' పరికరాల వేలం!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం..ప్రజావేదిక పరికరాల వేలం!
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తోలి మంత్రివర్గ సమావేశం...

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత తోలి మంత్రివర్గ సమావేశం ప్రజావేదికలో నిర్వహించారు. కృష్ణా నది ఒడ్డున అప్పటి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ వేదిక నిర్మాణం జరిగింది. ఈ కట్టడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కనే ఉంది. ముఖ్యమైన సమావేశాలు ఇక్కడే నిర్వహించేవారు. అయితే, ఈ కట్టడం అక్రమ కట్టడం అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తోలి మంత్రి వర్గ సమావేశంలో చెప్పారు. అంతే కాకుండా ఇటువంటి అక్రమ కట్టడాలను సహించేది లేదంటూ చెబుతూ ఆ కట్టడాన్ని కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు సమావేశం జరిగిన మరుసటి రోజునే సీఅర్దీయే అధికారులు ప్రజావేదికను కూల్చి వేశారు.

అయితే, కట్టడాన్ని కూల్చివేసినా, అందులోని విలువైన వస్తువులను మాత్రం అక్కడే వదిలేశారు. వాటిని ఏం చేయాలనే దానిపై ఇంతవరకూ ఒక క్లారిటీ రాలేదు. ఇప్పుడు సీఆర్దీయే అధికారులు కూల్చివేసిన ప్రజావేదిక కట్టడంలోని విలువైన సామగ్రీని వేలం వేయాలని నిర్ణయించింది. ప్రజావేదికలో ఉన్న ఏసీలు, ఇతర పరికరాల వివరాలను సీఅర్దీయే తన వెబ్ సైట్ లో ఉంచింది. ఈ పరికరాలను వేలం వేస్తున్నట్టు ప్రకటించింది. వేలానికి సంబంధించిన పత్రాలను ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 3వ తేదీ లోపు డౌన్లోడ్ చేసుకోవాలనీ, మార్చి 4వ తేదీ మధ్యాహ్నం ఈ పరికరాలను వేలం వేస్తామనీ సీఅర్దీయే పేర్కొంది.





Show Full Article
Print Article
More On
Next Story
More Stories