ఏపీ సర్వశిక్షా అభియాన్ గ్రీన్ చానెల్ ద్వారా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదల

ఏపీ సర్వశిక్షా అభియాన్ గ్రీన్ చానెల్ ద్వారా కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ విడుదల
x
Highlights

ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా సంస్థ ఆధీనంలో పని చేస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీలకు, మండల రిసోర్స్, క్లస్టర్ రిసోర్సు కేంద్రాలకు సర్వ శిక్షాభియాన్...

ప్రభుత్వ ఆదేశాల మేరకు సమగ్ర శిక్షా సంస్థ ఆధీనంలో పని చేస్తున్న పాఠశాల యాజమాన్య కమిటీలకు, మండల రిసోర్స్, క్లస్టర్ రిసోర్సు కేంద్రాలకు సర్వ శిక్షాభియాన్ ద్వారా నిధులు విడుదల చేసినట్టు ఏపీ పాథశాల విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిలో కాంపోజిట్ స్కూల్ గ్రాంట్ రూ. 9810.00 లక్షలు, మండల కేంద్రాల గ్రాంట్ రూ. 408.00 లక్షలు, క్లస్టర్ కేంద్రాలకు రూ. 847.14 లక్షల రూపాయలు (మొత్తం రూ. 11065.14 లక్షలు) విద్యాసంవత్సరం మొత్తానికి బుధవారం (31.7.19)న 13 జిల్లాల ఎస్ఎస్ఏ ప్రాజెక్టు అధికారుల గ్రీన్ చానెల్ పీడీ ఖాతాలకు జమచేశారు. ఈ నిధులను పాఠశాలల యాజమాన్య కమిటీలకు విడుదల చేయాల్సి ఉంటుంది. అయితే, ప్రభుత్వ ఆదేశాల ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలు కూడా ఈ సంవత్సరం నుండి పీడీ ఖాతాలు తెరవాల్సి ఉంది. అందుకోసం పాఠశాల యాజమాన్య కమిటీలచే పీడీ ఖాతాలు తెరిపించి తదుపరి ఈ నిధులను వారికి నేరుగా విడుదల చేయాల్సిందిగా జిల్లా ప్రాజెక్టు అధికారులకు ఈ సందర్భంగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు వెంటనే సీఎఫ్ఎంఎస్ హెల్ప్ డెస్క్ ద్వారా గ్రీన్ చానెల్ పీడీ అకౌంట్లు తెరవాల్సిందిగా కోరుతున్నట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories