Botsa Satyanarayana: అశోక్‌గజపతి రాజు చెప్పింది శుద్ధ అబద్ధం

Botsa Satyanarayana: అశోక్‌ గజపతి అధికారులపై దుర్బాషలాడరని మంత్రి బొత్స ఆరోపణ

Sandeep Eggoju
Published on: 23 Dec 2021 4:55 PM IST
AP Minister Botsa Satyanarayana Comments On Ashok Gajapathi Raju | AP News
X

అశోక్‌ గజపతి అధికారులపై దుర్బాషలాడరని మంత్రి బొత్స ఆరోపణ

Botsa Satyanarayana: అశోక్ గజపతిరాజు చెప్పింది శుద్ధ అబద్ధమని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. రామతీర్థం ఆలయానికి శంకుస్థాపన చేసే ముందు పద్ధతి ప్రకారం అందరిని ఆహ్వానించామన్నారు. ఆహ్వానం అందించడానికి ఈవో, ఆలయ అర్చకులు వెళ్లారని మంత్రి వివరించారు. శంకుస్థాపన గంట ముందు వెళ్లి శిలాఫలకాన్నీ విసిరివేయాలని చూశారని మంత్రి ఆరోపించారు.

అక్కడున్న వారు అశోక్ గజపతిరాజుని అడ్డుకున్నారని, అడ్డుకున్న అధికారులను అశోక్ గజపతి దుర్బాషలాడారని మంత్రి అన్నారు. బాధ్యత గల వ్యక్తులు పద్ధతిగా వ్యవహరించాలని సూచించారు. అశోక్ గజపతిరాజు బాధ్యత లేకుండా అసభ్యంగా ప్రవర్తించారని మంత్రి ఎద్దేవా చేశారు.

Sandeep Eggoju

Sandeep Eggoju

Next Story