ప్రారంభమైన ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు

ప్రారంభమైన ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు
x
Highlights

ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను సోమవారం ఉదయం 9గంటలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.ఈరోజు ఉదయం ప్రారంభమైన...

ఏపీ శాసనసభ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలను సోమవారం ఉదయం 9గంటలకు అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రారంభించారు.ఈరోజు ఉదయం ప్రారంభమైన ఈ సమావేశాలు మరో 9 రోజుల పాటు జరగనున్నాయి. సమావేశం ప్రారంభం కాగానే మొదటి గంటలోనే ప్రశ్నోత్తరాలను చేపట్టారు స్పీకర్. ఈ సందర్భంగా విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)పై ప్రతిపక్షం నాయకులు అడిగిన ప్రశ్నకు ఆర్థిక మంత్రి, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ సమాధానం ఇచ్చారు.

ఈ రోజు జరుగుతున్న సమావేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై స్వల్పకాలిక చర్చ కూడా చేయనున్నారు. ఇలాంటి కేసుల విచారణ నెలల తరబడి కాకుండా మూడు వారాల్లో పూర్తి చేసి నిందితులకు శిక్షలు పడేలా కఠిన చర్యలు తీసుకునేలా చేయనున్నారు. జిల్లాజడ్జితో కూడిన జిల్లాకో ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు పలు కీలక బిల్లుపై నేడు సభలో చర్చ జరుగనుంది. అనంతరం క్వశ్చన్ అవర్ తర్వాత బీఏసీ మీటింగ్ ను నిర్వహిస్తారు. అందులో సమావేశాలు ఎన్నిరోజులు నిర్వహించాలన్నదానిపై తుది నిర్ణయానికొస్తారు. బీఏసీ జగన్ సర్కారు 6 నెలల పాలన, సంక్షేమ పథకాల అమలు వంటి మొత్తం 20 అంశాలపై చర్చించే అవకాశం కనిపిస్తుంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories