మహిళా మిత్రను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం

మహిళా మిత్రను ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం
x
Highlights

మహిళలు, చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం మహిళా మిత్ర పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి....

మహిళలు, చిన్నారులకు మరింత రక్షణ కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌ యంత్రాంగం మహిళా మిత్ర పేరిట కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. ఇప్పటికే విజయవాడలో దీనిని అమలు చేస్తుండగా ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా అమలు కానుంది. మహిళల రక్షణ కోసం ఏపీ ప్రభుత్వం కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సైబర్ క్రైం వల్ల మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు నివారించడానికి మహిళా మిత్రను ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన 10 నుంచి 20 మంది ఉత్సాహవంతులైన మహిళలను ఎంపిక చేసి వారిని మహిళామిత్రలుగా నియమించనున్నారు. తమ ప్రాంతంలోని మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించేలా కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఎంపికైన వారికి ముందుగా మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలు, చిన్నారులు, మహిళలను వేధిస్తే ఎదురయ్యే కేసుల గురించి అవగాహన కల్పించడంతోపాటు పోలీసులతో సమన్వయం చేసుకోవడంపై శిక్షణ ఇస్తారు.

మహిళలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి ఒక్క బటన్‌ నొక్కితే చాలు, పోలీసులకు చేరే విధంగా త్వరలోనే యాప్‌ను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో పాటు సమస్యలు ఎక్కువయ్యాయని అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌ ద్వారా మనకు తెలియకుండానే మన వ్యక్తిగత సమాచారం మొత్తం నేరస్తులకు వెళ్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అధిక సంఖ్యలో మహిళలు, యువతులు, విద్యార్ధినులు సైబర్ స్పేస్‌లో సమస్యలు ఎదురుకొంటున్నారని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ అన్నారు. తమకు తెలియకుండానే నేరస్తుల నుంచి మెసేజ్‌లు, బెదిరింపులు ఎదుర్కోవడం జరుగుతుందన్నారు. మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం సైబర్ మిత్ర, మహిళా మిత్ర సేవలను అమల్లోకి తీసుకువచ్చిందని డీజీపీ తెలిపారు.మహిళలు, చిన్నారుల భద్రతకు ప్రత్యేక యాప్‌ రూపొందించడంతో.. మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories