ఇళ్లలో రివర్స్‌టెండరింగ్‌ రూ.105.91కోట్లు ఆదా

ఇళ్లలో రివర్స్‌టెండరింగ్‌ రూ.105.91కోట్లు ఆదా
x
Highlights

ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజల డబ్బును ఆదా చేసింది. ఎపి టిడ్కో (ఎపి టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్...

ఇళ్ల నిర్మాణంలో రివర్స్ టెండర్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ప్రజల డబ్బును ఆదా చేసింది. ఎపి టిడ్కో (ఎపి టౌన్‌షిప్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) మొదటి దశలో 14,368 హౌసింగ్ యూనిట్ల రివర్స్ బిడ్డింగ్ ద్వారా మొత్తం రూ .105.91 కోట్లను ఆదాచేసింది. రివర్స్ టెండర్లను గురువారం ఖరారు చేశారు. టీడీపీ హయాంలో పట్టణాలకు హౌసింగ్ స్కీమ్ కోడ్ కింద 65,969 హౌసింగ్ యూనిట్లతో ప్రాజెక్టులను ఏపీటిడ్కో చేపట్టింది. ఇతర రాష్ట్రాల కంటే అధిక ధరలకు టెండర్లను ఖరారు చేసింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత, రివర్స్ టెండర్ ప్రక్రియతో ఈ ప్రాజెక్టుకు టెండర్లు పిలిచింది. ఏపీ టిడ్కో మొదటి దశలో చిత్తూరు, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో 14,368 హౌసింగ్‌ యూనిట్లకు రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియ చేపట్టింది. తద్వారా రూ.105.91 కోట్లు ఆదా చేసినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

చిత్తూరు జిల్లాలో 5,808 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలు చేసిన టెండర్లలో డీఈసీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.271.03 కోట్ల విలువైన పనులకు 15 శాతం తక్కువకు అంటే రూ.2309.18 కోట్లకే ఆ సంస్థ బిడ్‌ దాఖలు చేసింది. అలాగే కృష్ణా జిల్లాలో 2,064 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలు చేసిన టెండర్లలో ఎన్‌జేఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.95.65 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.81.30 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. విశాఖ జిల్లాలో మొత్తం 3,424 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి దాఖలైన టెండర్లలో ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. రూ.192.23 కోట్ల విలువైన పనులకు ఆ సంస్థ 15 శాతం తక్కువకు అంటే రూ.163.40 కోట్లకు బిడ్‌ దాఖలు చేసింది. ఇటు విజయనగరం జిల్లాలో మొత్తం 3,072 హౌసింగ్‌ యూనిట్ల నిర్మాణానికి రివర్స్ టెండర్ నిర్వహించగా.. ఇంద్రజిత్‌ మెహతా కన్‌స్ట్రక్షన్స్‌ ఎల్‌–1గా నిలిచింది. ఆ సంస్థ రూ.148.12 కోట్ల విలువైన పనులకు 14.78 శాతం తక్కువకు అంటే రూ.126.24 కోట్లకు బీడ్ దాఖలు చేసింది. దీంతో మొత్తం రూ.105.91 కోట్లు ఆదా అయినట్టయింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories