గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలకు కమిటీల ఏర్పాటు

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకాలకు కమిటీల ఏర్పాటు
x
Highlights

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం అయింది. ఇందుకు సంబందించి ఈ నెల 1 నుంచి 8 వరకూ నియామక పరీక్షలు పూర్తీ చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి దశలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది.

ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు అర్హులను ఎంపిక చేసే ప్రక్రియ వేగవంతం అయింది. ఇందుకు సంబందించి ఈ నెల 1 నుంచి 8 వరకూ నియామక పరీక్షలు పూర్తీ చేశారు. ఈ నేపథ్యంలో తదుపరి దశలో ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నదానిపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. దీనికోసం జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జిల్లాస్థాయి కమిటీ ఛైర్మన్‌గా కలెక్టర్‌ వ్యవహరించనుండగా.. ఉపాధ్యక్షుడిగా జాయింట్‌ కలెక్టర్‌, కన్వీనర్‌గా జిల్లా కేంద్రంలోని మున్సిపల్‌ కమిషనర్‌, సభ్యులుగా ఇతర ప్రాంతాల్లోని మున్సిపల్ కమిషనర్ల వ్యవహరించనున్నారు. పరీక్షల ప్రక్రియ పూర్తవడంతో తర్వాతి దశలో చేపట్టాల్సిన ఫలితాల వెల్లడి, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెరిట్ లిస్టు, రోస్టర్ రూపకల్పన బాధ్యతలను జిల్లాస్థాయి కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే జిల్లాస్థాయి కమిటీ పంపిన జాబితా ఆధారంగా ప్రాంతీయ కమిటీ తదుపరి కార్యాచరణను చేపడుతుంది.

కాగా, ప్రాంతీయ కమిటీకి ఛైర్మన్‌గా మున్సిపల్ శాఖ రీజినల్‌ డైరెక్టర్‌ వ్యవహరిస్తారు. ఇక సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌, టౌన్‌ ప్లానింగ్‌ రీజినల్ డైరెక్టర్‌ ఈ కమిటీకి సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ కమిటీకి ధ్రువపత్రాల పరిశీలన, ఖాళీల గుర్తింపు, నియామక ఆదేశాల జారీ లాంటి బాధ్యతలను అప్పగించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories