వాడీ వేడి చర్చతో పాటు నవ్వుపుట్టించే అంశాలు..

వాడీ వేడి చర్చతో పాటు నవ్వుపుట్టించే అంశాలు..
x
Highlights

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభలో వాడీ వేడి చర్చతో పాటు.. నవ్వు పుట్టించే అంశాలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధంలో నవ్వులూ...

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల రెండో రోజు సభలో వాడీ వేడి చర్చతో పాటు.. నవ్వు పుట్టించే అంశాలు జరిగాయి. అధికార, ప్రతిపక్ష మధ్య మాటల యుద్ధంలో నవ్వులూ కనిపించాయి. సభ్యుల హవభావాలు సైతం నవ్వు పుట్టించాయి. ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో సభ్యుల మధ్య వాడీ వేడి చర్చల్లో నవ్వులు కూడా పూస్తున్నాయి. అసెంబ్లీ సమావేశాల రెండో రోజుల ఇలాంటి దృశ్యాలు సభలో చాలా కనిపించాయి. సున్నా వడ్డీ రుణాలు అంశంపై టీడీపీ సభ్యుడు అచ్చెన్నాయుడు రెండో రోజు చర్చను కొనసాగించే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు వైసీపీ సభ్యులు సభలో నవ్వడం కనిపించింది.

టీడీపీ సభ్యులు రుణాల విషయంపై ప్రశ్నించడంపై సీఎం జగన్ స్పందించారు. టీడీపీ సభ్యులు పూర్తిగా మాట్లాడిన తర్వాతే తాము మాట్లాడతామని నవ్వుపుట్టేలా కౌంటర్ ఇచ్చారు. అనంతరం సున్నా వడ్డీ రుణాల అంశంపై చంద్రబాబు మాట్లాడారు. దీనికి సమాధానం ఇస్తూ జగన్ మాట్లాడిన సమయంలో కూడా సభలో నవ్వులు విరిశాయి. ఒకనొక సమయంలో సభ్యుల మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తను మాట్లాడుతున్నప్పుడు అచ్చెన్నాయుడు అడ్డుపడటంపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే వైసీపీ సభ్యుడు అంబటి రాంబాబు సభలో తాను కూర్చూనే చోటు విషయంపై మాట్లాడారు. గత ప్రభుత్వం పనితీరుపై తనదైన తీరులో స్పందించారు. మొత్తానికి సభ అధికార, ప్రతిపక్ష సభ్యుల మాటాల యుద్ధంతో వేడిక్కినా.. అప్పుడుప్పుడు వారి మాటలు నవ్వులు పుట్టించాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories