మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కార్ దూకుడు.. విశాఖకు మరిన్ని నిధులు

మూడు రాజధానుల విషయంలో ఏపీ సర్కార్ దూకుడు.. విశాఖకు మరిన్ని నిధులు
x
Highlights

మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కార్ దూకుడు పెంచింది. విశాఖ పరిపాలనా రాజధానిగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది.

మూడు రాజధానుల వ్యవహారంలో జగన్ సర్కార్ దూకుడు పెంచింది. విశాఖ పరిపాలనా రాజధానిగా మార్చే దిశగా ముందుకు సాగుతుంది. పరిపాలనా రాజధానిగా విశాఖ బదలాయించడానికి తగు చర్యలు చేపట్టింది. గతంలో విశాఖలోని మిలీనియం టవర్‌ నుంచి పరిపాలన కొనసాగించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

అయితే అందుకు అనుగుణంగా మధురవాడ సమీపంలో మిలీనియం టవర్-బీ నిర్మాణం వేగంగా కొనసాగుతుంది. 80 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ పనులను ఏపీఐఐసీ పర్యవేక్షిస్తోంది. దీంతో మిలీనియం టవర్-బీ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదే సమయంలో ఏపీ ప్రభుత్వం మరో 19 కోట్ల 73 లక్షల రూపాయలను విడుదల చేసింది. ఈ మేరకు సోమవారం ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి కోన శశిధర్ జీవో జారీ చేశారు. సెక్రటేరియట్‌ను విశాఖకు తరలిస్తే.. మిలీనియం టవర్స్‌లోనే పనులు ప్రారంభించాలని భావిస్తోంది.

ఏపీఐఐసీ అధికారులు మిలీనియం టవర్-బీ నిర్మాణానికి 65 కోట్ల రూపాయలను విడుదల చేయాల్సి ఉంటుందంటూ తెలిపారు. దీని నిర్మాణాన్ని పర్యవేక్షిస్తోన్న ఇన్ఫార్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపారు. తాజాగా ప్రభుత్వం 19 కోట్ల 73 లక్షల రూపాయలను విడుదల చేసింది.

కాగా.. అత్యాధునిక సౌకర్యాలతో మిలీనియం టవర్-బీ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. టవర్-బీ పూర్తిస్థాయిలో మరో నెలరోజుల వ్యవధిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉగాది నుంచి పరిపాలనా అక్కడ నుంచే ప్రారంభించాలని సీఎం యోచిస్తున్నాట్లు తెలుస్తోంది.

హైకోర్టులో రాజధాని తరలింపు అంశంపై పిటిషన్లు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయాల్ని తరలించొద్దని కోర్టు సూచించిన సంగతి తెలిసిందే. కోర్టులో ఈ అంశంపై వాదనలు కొనసాగుతున్న వైసీపీ సర్కార్ మూడు రాజధానుల అంశంపై ముందుకు సాగుతోంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories