AP SSC Results 2022: ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే..?

AP SSC Results 2022 Postponed: ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే..?

Rama Rao
Updated on: 4 Jun 2022 12:50 PM IST
AP SSC Results 2022 Postponed | AP News
X

ఏపీలో పదో తరగతి ఫలితాలు వాయిదా.. విడుదల ఎప్పుడంటే..?

Andhra Pradesh: ఏపీలో పదో తరగతి పరీక్షా ఫలితాల విడుదలలో గందరగోళం ఏర్పడింది. ఇవాళ ఉదయం 11గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ముందు ప్రకటించిన విద్యాశాఖ.. సోమవారానికి వాయిదా వేశారు. అనివార్య కారణాలతో ఫలితాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఆరు లక్షల మంది విద్యార్థుల ఎదురుచూపులకు బ్రేక్ పడింది. మరోవైపు మంత్రి బొత్స, అధికారుల మధ్య సమన్వయ లోపం వల్లే ఫలితాలు వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. మంత్రి బొత్సకు సమాచారం ఇవ్వకుండా ఫలితాల ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. దీంతో అధికారుల తీరుపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


Rama Rao

Rama Rao

Next Story