తగిన విధంగా ఆదుకోండి.. ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్

తగిన విధంగా ఆదుకోండి.. ప్రధాని మోడీని కోరిన ఏపీ సీఎం జగన్
x
YS Jagan and Narendra Modi (File Photo)
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాన్ని ప్రారంభించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌ షాలు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్‌ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో రోజు రోజుకు దేశంలో పెరుగుతున్న కరోనా కేసుల గురించి, దేశాన్ని పట్టిపీడిస్తున్నకరోనాను నివారించేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు. అంతే కాక దేశ వ్యాప్తంగా వలసలు వచ్చిన కూలీలు, కార్మికులు చేసే ప్రయాణాల గురించి, లాక్ డౌన్ కారణంగా ప్రజలు ఎదుర్కోంటున్న ఇబ్బందుల గురించి చర్చించారు. ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలో వివరించారు. ఈ మధ్య కాలంలో ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారికి కరోనా సోకడం వంటి అంశాలను చర్చించారు. ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులతో పాటు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాల్గొన్నారు.

ఇక ఈ సమావేశంలో ప్రధాన మంత్రితో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కరోనా లక్షణాలు కనిపించిన వారిని వెంటనే అదుపులోకి తీసుకుని ఐసోలేషన్ కి పంపిస్తున్నారు. రాష్ట్రంలో కేసుల గురించి ఎప్పటి కప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామన్నారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్‌లో 132 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గడిచిన రెండు రోజుల్లోనే కేసుల సంఖ్య అధికంగా పెరిగిపోయాయని, నమోదయిన కేసుల్లో ఎక్కువగా ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారేనని తెలిపారు.

నమోదయిన 132 కేసులలో 111 జమాత్‌ కు వెళ్లినవారు, వారితో కాంటాక్టులో ఉన్నవారేనని వివరించారు. ఢిల్లీకి వెల్లి వచ్చిన వారి వివరాలు తీసుకుంటున్నామన్నారు. కుటుంబాల వారీగా చేస్తున్న సర్వే అంశాలను ప్రధానికి వివరించారు. అనుమానితులను అందరినీ క్వారంటైన్, ఐసోలేషన్‌కు తరలించి వారికి వైద్య సదుపాయాలు అందిస్తున్నామన్నారు. కరోనా కేసుల సంఖ్య పెరిగిపోవడంతో మెడికల్‌ పరికరాలలు సరిపోవడం లేదని, తగిన సంఖ్యలో వాటిని అందించాలని కోరారు. కరోనా కారణంగా రాష్ట్రంలో ఆదాయం బాగా దెబ్బతిందని, రాష్ట్రానికి కావలసిన నిధులను విడుదల చేసి ఆంధ్రప్రదేశ్ ను ఆదుకోవాలని ప్రధానిని సీఎం జగన్ కోరారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories