రాజకీయం స్వామీజీలను దాటి అఘోరాలకూ పాకిందా?

రాజకీయం స్వామీజీలను దాటి అఘోరాలకూ పాకిందా?
x
Highlights

అఘోరా.. ఈ పేరు తెలియని వారుండరు. హిమాలయా పర్వత ప్రాంతాల్లో తమ మానాన తాము తపస్సు చేసుకుంటూ.. ఆధ్యాత్మిక లోకంలో.. ప్రమాత్ముడి తోనే కలిసి జీవిస్తున్నట్టుగా జీవిస్తారు. వారు సాధారణంగా ఎవరి కంటా పడరు . ఎపుడన్నా కుంభమేళాలు జరిగినపుడు ఉత్తరాదిన కనిపిస్తుంటారు. కానీ, వారిప్పుడు ఏపీలో రాజకీయ నాయకుల ఇంట కనిపించారని వస్తున్న వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి.

అఘోరా పేరు వినని భారతీయులుండరు. వారికి ఉన్న ప్రత్యేకతే వేరు. ప్రపంచంతో సంబంధం లేకుండా. ఎవరికీ కనిపించకుండా.. వినిపించకుండా హిమాలయ పర్వత ప్రాంతాల్లో తపస్సు చేసుకుంటూ ఆధ్యాత్మిక జీవనం గడిపేస్తుంటారు. అటువంటి వారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోని రాజకీయ నాయకుల ఇంట ప్రత్యక్షమవటం చర్చనీయాంశంగా మారింది. అసలు జనజీవన స్రవంతిలో అఘోరాలు కనిపించడం చాలా అరుదు. అందులోనూ దక్షిణ భారతావనిలో కనిపించడం దాదాపు జరగదు. కానీ, ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి అఘోరాలు రావడం సంచలనం సృష్టిస్తోంది. అఘోరాలు సుబ్బారెడ్డి ఇంటికి వచ్చి ప్రత్యేక పూజలు చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పూజలు చేయడానికి హిమాలయాల నుంచి వారు ఇక్కడికి రావడం అందరిలోనూ విపరీతమైన ఆసక్తిని రేకెత్తిస్తోంది. పూజల అనంతరం వైవీ సుబ్బారెడ్డి కుక్తుంబ సభ్యులను అఘోరాలు ఆశీర్వదిస్తున్న ఫోటోలు ఇప్పుడు నేట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి.

ఇదిలా ఉండగా బీజేపీ సీనియర్ నేత, మాజీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు ఇంటిలో కూడా అఘోరాలు ప్రత్యక్షమయ్యారు. గంగరాజు ఇంటిలో అయన కుటుంబసభ్యుల మధ్య అఘోరాలు కూర్చుని ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఈ రెండు ఫోటోలతో ఆంధ్రప్రదేశ్ లో సంచలనం రేకెత్తింది. ఈ ఫోటోల విషయమై ప్రజలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.

మన దేశంలో స్వామీజీలు రాజకీయ నాయకులు కల్సి తిరగడం.. ఒకరి పై ఒకరు ప్రేమ కురిపించుకుని పొగడ్తలు గుప్పించుకోవడం.. పెద్ద పదవుల్లో ఉన్నవారు కూడా స్వామీజీల పాదపూజలు చేయడం సర్వ సహజంగా కనిపించే దృశ్యాలు. కానీ, ఎప్పుడో కుంభమేళాలు వంటివి జరిగినప్పుడు ఎక్కడి నుంచి వస్తారో.. ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు తిరిగి వేల్లిపోటారో తెలీని విధంగా సంచరించే అఘోరాలు ఏపీలో ప్రత్యక్షమవటం.. అదీ పేరెన్నిక గన్న రాజకీయ నాయకుల వద్ద ప్రత్యక్షమవడం అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories