50 కేజీల కారంతో స్వామీజీకి అభిషేకం..!

* 50కిలోల కారంతో స్వామీజీకి అభిషేకం

R Tripura Malini
Updated on: 14 Nov 2022 12:15 PM IST
Abhishekam with chilli powder as part of Pratyangira Devi Homam
X

ప్రత్యంగిరా దేవి హోమంలో భాగంగా కారంతో అభిషేకం

Eluru: మామూలుగా కారం తగిలితేనే మంటెత్తిపోతుంది మనకు.. కారం నాలుకే కాదు.. శరీరంపై ఎక్కడ తగిలినా చర్మం మంట పుడుతుంది. కానీ ప్రత్యంగిరి దేవీ ఉపాసకులు శివస్వామికి కారంతో అభిషేకం జరిపారు ఆ‍యన భక్తులు... ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం దొరసానిపాడులో శ్రీ శివ దత్తాత్రేయ ప్రత్యంగరి వృద్ధాశ్రమo వద్ద ఈ కార్యక్రమాన్ని స్థానికులు ఘనంగా నిర్వహించారు.

ముందుగా ప్రత్యంగరి దేవికి పూర్ణాహుతి హోమాన్ని జరిపారు. అనంతరం శివ స్వామి ప్రత్యంగిరి దేవిని ఆవాహన చేసుకుని దీపోత్సవాన్ని ప్రారంభించారు. తరువాత దేవి ఆవాహనలో ఉన్న శివ స్వామిని భక్తులు పెద్దఎత్తున కారంతో అభిషేకం చేశారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు స్థానికులు పెద్దఎత్తున అక్కడికి తరలివచ్చారు. సుమారు 50 కేజీల కారంతో శివ స్వామిని అభిషేకించారు. హిరణ్య కశ్యపుడిని నరసింహ స్వామి వధించిన అనంతరం స్వామి వారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి ఉద్భవించిందని పండితులు చెబుతున్నారు.

R Tripura Malini

R Tripura Malini

Next Story