Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానంతో ఆసుపత్రిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి!

Coronavirus: ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానంతో ఆసుపత్రిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి!
x
హైదరాబాద్‌లో స్వైన్‌ఫ్లూ కలకలం
Highlights

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానంతో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కరోనా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణాలో కరోనా...

ఆంధ్రప్రదేశ్ లో కరోనా అనుమానంతో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కరోనా వైరస్ సోకి ఉండవచ్చనే అనుమానంతో కాకినాడ జనరల్ ఆసుపత్రికి తరలించారు. తెలంగాణాలో కరోనా కేసు నమోదు కావడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలర్ట్ అయింది. వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు.

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలం వాడపాలెం గ్రామానికి చెందిన ఒక యువకుడికి కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు అనుమానించారు. ఈ యువకుడు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారని అధికారులు గుర్తించారు. ఇటీవల ఇతను తన విధుల్లో భాగంగా దక్షిణ కొరియాకు వెళ్ళివచ్చాడు. వారం క్రితమే సొంతూరు వాడపాలెం చేరుకుకుని అక్కడ మూడురోజులు ఉన్నట్టు అధికారులు భావిస్తున్నారు. దక్షిణ కొరియాలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉండడం తో ఈ యువకునికి కూడా కోవిద్ వైరస్ సోకి ఉండవచ్చని అనుమానంతో తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కు తెలంగాణా అధికారులు సమాచారం ఇచ్చారు.

దీంతో అధికారులు అప్రమత్తమై వాడపాలెంలోని అతని ఇంటి వద్ద విచారించారు. అయితే, అతను అప్పటికే తన అత్తవారిళ్లయినా ముమ్మిడి వరం మండలం వెళ్లినట్టు తెలుసుకున్నారు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న అధికారులు ఆ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కరోనా సోకిందా? లేదా? అని నిర్ధారించడం కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అంతే కాకుండా ఈ మూడురోజుల నుంచి అతను ఎక్కడెక్కడ తిరిగాడు..ఎవరెవరిని కలిశాడు.. వంటి విషయాలు తెలుసుకుని, వారికి కూడా వైద్య పరీక్షలు జరిపించాలని అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories