చిన్నారిని చిదిమేసిన నులిపురుగుల మాత్ర

చిన్నారిని చిదిమేసిన నులిపురుగుల మాత్ర
x
Highlights

అవగాహనా రాహిత్యం ఆ చిన్నారి ప్రాణాలను బలిగొంది. సిబ్బంది నిర్లక్ష్య వైఖరి ఆ కుటుంబానికి కడుపుకోత మిగిల్చింది. నులిపురుగుల నివారణకోసం ఇచ్చిన మాత్ర అభంశుభం తెలియని ఆ బాలుని ఆయుషు తీసింది. విజయనగరం జిల్లా గరుగుబిల్లి మండలం కె.ఆర్‌.ఎన్‌.వలస అంగన్‌వాడీ కేంద్రంలో చోటు చేసుకున్న ఈ సంఘటన అందరినీ కలచివేసింది.

పొట్టలో నులి పురుగులు చంపేందుకు వేసిన మాత్ర ఓ బాలుడు ప్రాణం తీసిన ఘటన విజయనగరం జిల్లా కేఆర్‌ఎన్‌వలస గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. నులిపురుగుల నివారణ _ దినోత్సవం సందర్భంగా కేఆర్‌ఎన్‌వలస గ్రామం అంగన్‌వాడీ కేంద్రంలో కొట్నాన జశ్వంత్‌నాయుడు(2)కు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో ఆల్‌బెంద్‌జోల్‌ మాత్రను అంగన్‌వాడీ నిర్వాహకులు అందించారు. బాలుడి నాన్నమ్మ అప్పమ్మ ఒడిలో పడుకోబెట్టి ఏఎన్‌ఎం మరడాన సుమతి, అంగన్‌వాడీ నిర్వాహకురాలు కొట్నాన సరస్వతి మాత్రను మింగించారు. తొలుత బాలుడు మాత్రను మింగలేక

కక్కేయడంతో రెండోసారి బాలునిచే మింగించారు. మాత్ర మింగిన కొద్ది సేపటికే బాలుడు అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే తల్లిదండ్రులు కొట్నాన చంద్రశేఖరరావు, సుజాత పార్వతీపురంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించడంతో ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లమని అక్కడి. వైద్యులు చెప్పడంతో వెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షించే సమయానికే బాలుడు మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.

స్వగ్రామం చూద్దామని వచ్చి బిడ్డను కోల్పోయి..

రైల్వేలో ఉద్యోగం చేసుకుంటూ కాకినాడలో స్థిరపడిన చంద్రశేఖర్‌, సుజాతలు తన సొంత గ్రామమైన కొట్నాన రామినాయుడు వలస తల్లిదండ్రులు శివున్నాయుడు, అప్పమ్మలను చూసేందుకు వచ్చారు. శుక్రవారం కాకినాడ వెళ్లేందుకు సిద్ధం కాగా గురువారం నులిపురుగులు దినోత్సవం కావడంతో తన

కుమారుడికి కూడా మాత్రవేసి పొట్టలో నులిపురుగులు ఏమైనా ఉంటే చనిపోతాయని భావించి అంగన్‌వాడీ కేంద్రానికి నాన్నమ్మ అప్పమ్మతో పంపించారు. అక్కడ ఇచ్చిన మాత్రను మింగిన తరువాత తన కుమారుడు మృతి చెందాడని రోదిస్తూ పుట్టెడు దుఃఖంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతదేహానికి ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు.


Show Full Article
Print Article
More On
Next Story
More Stories